Revanth Reddy: ఎట్టకేలకు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఆనందంగా ఉండగా.. అవకాశం దక్కని అభ్యర్థులు నిరాశలో కూరుకుపోయారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కొన్ని రోజుల క్రితం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి సహజంగానే ఆ పార్టీ ఎవరిని నిలబెడితే వారే ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. నామమాత్రంగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఏకగ్రీవ ఎన్నికలని చెప్పవచ్చు. చివరి రోజు టీఆర్ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

ఆ మాజీ కలెక్టర్‌పైనే టీపీసీసీ చీఫ్ గురి..
టీఆర్ఎస్ పార్టీ అరుగురిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇందులో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన పాడి కౌషిక్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి లు ఉన్నారు. అయితే ఇందులో వచ్చిన కొందరి పేర్లు ఎవరూ ఊహించలేదు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పుడు పక్కన పెడుతారు అని అందరూ అనుకున్నారు. అలాగే కడియం శ్రీహరి ఎంపిక కూడా ఎవరూ ఊహించలేదు. అయితే ఇంకో అభ్యర్థి ఇక్కడ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయనే సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. నామినేషన్ల స్వీకరణ ముగింపు గడువుకు ఇంకా రెండు రోజులు సమయం ఉందనగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వెంటనే ప్రగతి భవన్ కు వచ్చారు. ఎప్పటి నుంచో సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటున్న వెంకట్రామిరెడ్డి పలు వివాదాల్లో కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ సిద్దిపేటకు వచ్చిన్నప్పుడు ఆయన కాళ్లకు నమస్కరించడం, రైతులెవరూ వరి వేయొద్దని, ఈ విషయంలో కోర్టు చెప్పినా నేను వినబోనంటూ చేసిన వాఖ్యలు అప్పట్లో దూమారం రేపాయి.
Also Read: KCR vs BJP: బీజేపీని కొట్టేయాలి.. కేసీఆర్ కేబినెట్ విస్తరణ వెనుక భారీ ప్లాన్?
అయితే ఈయనకు ఎమ్మెల్సీ కేటాయించడంపై రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నారు. ఈ ఎంపికపై ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఒక కలెక్టర్ రాజీనామాను 24 గంటల్లో ఎలా ఆమోదిస్తారని, నిబంధనలు పాటించకుండా ఆయన అభ్యర్థనను ఎలా అంగీకరిస్తారని విమర్శించారు. వెంకట్రామిరెడ్డిపై కోర్టులో ఇప్పటికే ఆరు కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఆయనకు చెందని సంస్థకే కోకాపేట భూములు అప్పగించారని ఆరోపించారు. ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్ని ప్రభుత్వాల సీఎంలతో సాన్నిహిత్యంతో ఉన్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి లతోనూ ఆయన చాలా క్లోజ్‌గా ఉండేవారని అన్నారు. అలాగే ఇప్పటి సీఎం కేసీఆర్‌తోనూ ఆయన చాలా సఖ్యతగా ఉన్నారని అందుకే వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు అందించిన అఫిడవిట్ బయటకు వస్తే మరిన్ని ఆరోపణలు చేయాలనుకున్న రేవంత్ రెడ్డి కోరిక నెరవేరలేదు. ఆయన అఫిడవిట్ బయటకు రాలేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేసిన ఏ అభ్యర్థిని టార్గెట్ చేయని టీపీసీసీ చీఫ్ కేవలం వెంకట్రామిరెడ్డిపైనే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి కొన్ని రోజులు గడిస్తేనే కానీ రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటో అర్థం కాదు.
Also Read: KCR: కేంద్రప్రభుత్వాన్ని వదలా..18న మహాధర్నా.. కేసీఆర్ సంచలనం