David Warner: అంతర్జాతీయ క్రికెట్లో విమర్శలు సహజమే. ప్రతి ఆటలో ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. దీనిపై ప్రేక్షకులు సైతం రెండు విధాలుగా స్పందిస్తూ సమస్యను పక్కదారి పట్టించడం మామూలే. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో కూడా ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ఈ సారి పాకిస్తాన్ కెప్టన్ బాబర్ అజామ్ ను కాదని ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కు దక్కింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయితే దీనిపై పలు విధాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ ఆసీస్ ఆటగాడికి అవార్డు ఇవ్వడంపై తనదైన శైలిలో విమర్శలు చేశాడు. అత్యధిక పరుగుల చేసిన వాడికి ఇచ్చే అవార్డును తక్కువ పరుగులు చేసిన వాడికి ఇవ్వడంపై పెదవి విరిచాడు. మరో ఆటగాడు షోయబ్ అక్తర్ కూడా బాబరే అర్హుడని పేర్కొనడం గమనార్హం.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ 303 పరుగులు చేయగా ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (280) పరుగులు మాత్రమే చేశాడు. కానీ అవార్డు మాత్రం వార్నర్ ను వరించింది. దీంతో అందరిలో అనుమానాలు పెరిగాయి. అయితే పరుగలు మాత్రమే కాదు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతోనే ఆ అవార్డుకు వార్నర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Also Read: T20 World Cup Final: బూట్లలో పోసుకుని బీరు తాగడం.. ఆస్ట్రేలియన్ల సంప్రదాయం కథ తెలుసా?
ఇవేమీ అర్థం కాని కొందరు కావాలనే విమర్శలకు దిగుతున్నట్లు అభిప్రాయాలు వస్తున్నాయి. కీలక మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు గాను వార్నర్ ను పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. మొత్తానికి టైటిల్ తో పాటు అవార్డును సైతం ఆసిస్ తీసుకోవడంతో పాకిస్తాన్ లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఆటల్లో ఎప్పుడు దూకుడుగా ఉండే పాక్ ఆటగాళ్లకు ఇవేవీ అర్థం కావని తెలియదా అనే ప్రశ్నలు సైతం అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఆటలో గెలుపోటములు సహజమని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Hardik Pandya: హార్ధిక్ పాండ్యాకు షాకిచ్చిన అధికారులు.. ఆ రూ.5 కోట్ల వాచీల కథేంటి?