https://oktelugu.com/

హ్యాకర్ల బారినపడిన యంగ్ బ్యూటీ..!

తెలుగమ్మాయి, యంగ్ బ్యూటీ ఈషారెబ్బాకు హ్యాకర్లు షాకిచ్చారు. తన ట్వీటర్ ఖాతాను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేయడంతో సంబంధిత ట్వీటర్ యాజమాన్యానికి ఈషారెబ్బా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈమేరకు ‘నా ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అయింది.. దాన్ని ఓపెన్ చేస్తే మీ అకౌంట్ లేదని.. చూపిస్తోందని..’ ఈషారెబ్బా ఇన్ స్ట్రాలో పోస్టు చేయడంతో ఈ విషయం అందరికీ తెల్సింది. Also Read: ఒకేసారి ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టిన మెగా హీరో తెలుగమ్మాయి ఈషారెబ్బా ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2020 / 08:00 PM IST
    Follow us on


    తెలుగమ్మాయి, యంగ్ బ్యూటీ ఈషారెబ్బాకు హ్యాకర్లు షాకిచ్చారు. తన ట్వీటర్ ఖాతాను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేయడంతో సంబంధిత ట్వీటర్ యాజమాన్యానికి ఈషారెబ్బా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈమేరకు ‘నా ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అయింది.. దాన్ని ఓపెన్ చేస్తే మీ అకౌంట్ లేదని.. చూపిస్తోందని..’ ఈషారెబ్బా ఇన్ స్ట్రాలో పోస్టు చేయడంతో ఈ విషయం అందరికీ తెల్సింది.

    Also Read: ఒకేసారి ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టిన మెగా హీరో

    తెలుగమ్మాయి ఈషారెబ్బా ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో క్రేజీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. టాలీవుడ్, ఇతర భాషల్లో ఇప్పటికే పలు సినిమాల్లో ఈషారెబ్బా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. తనకు సంబంధించి లేటెస్ట్ పిక్స్, వీడియోలు, సినిమాలకు సంబంధించి ముచ్చట్లను ఎప్పటికప్పుడు అప్డేడ్స్ చేస్తోంది. అయితే కొందరు హ్యాకర్లు తన ఖాతా హ్యాక్ చేయడంతో ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. తన ట్వీటర్ అకౌంట్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

    తొలినాళ్లలో సినిమా ఆఫర్లు దక్కించుకోవడంలో వెనుకబడ్డ ఈషా రెబ్బా ప్రస్తుతం వరుస అవకాశాలతో బీజీగా స్టార్ గా మారింది. తెలుగులో ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, వంటి సినిమాల్లో నటించిన ఈషాకు సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత నాని నిర్మాణంలో వచ్చిన ‘అ’ మూవీతో మంచినటిగా పేరు తెచ్చుకుంది. అదేవిధంగా గతేడాది త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో పూజా హెగ్డే కు చెల్లెలు నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈషారెబ్బా ‘లస్ట్ స్టోరీస్‌’ అనే వెబ్ సీరిసులో నటిస్తోంది.

    Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి

    తన ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అవడంతో వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. అంతేకాకుండా సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే సెలబ్రెటీల ట్వీటర్ అకౌంట్స్ హ్యాక్ అవడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీల ట్వీటర్ అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇటీవల హీరోయిన్ పూజా హెగ్డే, సింగర్ స్మిత ట్వీటర్ అకౌంట్స్ హ్యాక్ అవగా తాజాగా ఈషా రెబ్బా అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈషా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్విట్టర్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.