Durandhar 2 Movie Flashback Scene Details: రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దురంధర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది… ఇక ప్రస్తుతం దానికి సీక్వెల్ గా ‘దురంధర్ 2’ సినిమా వస్తుంది. ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక భారీ హైప్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మొదటి రోజే 150 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని చూడడానికి ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను చాలా ఎక్స్ట్రాడినరీగా కట్ చేశారు. ఇక రణ్వీర్ సింగ్ గూడచారిగా ఎలా మారాడు, ఎలా పాకిస్తాన్ చేరుకున్నాడు. అనే సన్నివేశాలను ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!
ప్రతి ఒక్కరికి గూస్ బమ్స్ వస్తాయంటూ సినిమా యూనిట్ ప్రచారం చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే రన్వీర్ సింగ్ సైతం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడట. సినిమా యూనిట్ చెబుతున్నట్టుగానే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలిస్తే మాత్రం సినిమా ఈజీగా 2000 కోట్ల కలెక్షన్స్ ని సాధిస్తుంది అంటూ ప్రతి ఒక్కరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు రన్వీర్ సింగ్ చేసిన ఏ సినిమాకు లేనంత హైప్ ఈ సినిమాకి క్రియేట్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడే సినిమా ఇదే అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు…
ఇక ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక డిఫరెంట్ గా అటెంప్ట్ గా మిగిలిపోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి…ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రన్వీర్ సింగ్ తన సత్తా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఫైనల్ గా ఈ సినిమాతో ఆయనతో ఎలా మెప్పిస్తాడు అనేది…
