Dragon : ఈ ఏడాది అటు తమిళ ఇండస్ట్రీ లోనూ, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లోనూ సూపర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘డ్రాగన్'(Dragon Movie). తెలుగు లో ఈ చిత్రాన్ని ‘ది రిటర్న్ ఆఫ్ డ్రాగన్'(Return Of The Dragon) అనే పేరుతో విడుదల చేసారు. రెండు భాషల్లోనూ ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో మనం సోషల్ మీడియా లో అనేక వీడియోస్ చూసే ఉంటాము. యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. విడుదలై విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో వంద కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకోనుంది ఈ చిత్రం. అయితే ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ ని ముందుగా మన టాలీవుడ్ లో ఒక హీరో తో చేద్దాం అనుకున్నారట.
ఆ హీరో మరెవరో కాదు, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో రీసౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని డైరెక్టర్ అస్వత్ మారిముత్తు(Aswath Marimuthu) భావించాడట. ఆ నమ్మకంతోనే విజయ్ దేవరకొండ కి వెళ్లి ఈ సినిమా స్టోరీ వినిపించగా, ఆయనకు చాలా బాగా నచ్చింది కానీ, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం పెద్ద సినిమాలపైనే ఉందని, కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ చిత్రాన్ని చేద్దామని అన్నాడట. కానీ అందుకు అస్వత్ ఒప్పుకోలేదు. విజయ్ దేవరకొండ కాకపోతే, అతని దృష్టిలో ధనుష్(Hero Dhanush),ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ఉన్నారు. ధనుష్ ఫుల్ బిజీ గా ఉండడంతో, అస్వత్ ప్రదీప్ ని కలిసి స్టోరీ ని వినిపించగా, ఆయన తెగ నచ్చేసాడు, వెంటనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.
ఇక ఆ తర్వాత ఫలితాన్ని మనమంతా చూస్తూనే ఉన్నాం. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ సంక్షోభం లో పడిన తమిళ సినీ పరిశ్రమకి ఈ చిత్రం కొత్త ఊపిరి పోసింది. ఈ సినిమాని విజయ్ దేవరకొండ ఒప్పుకొని చేసుంటే కచ్చితంగా మరో గీత గోవిందం రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యేది, కానీ ఎందుకో ఆయన తన వయస్సుకి తగిన పాత్ర అయినప్పటికీ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanoori) తో ‘కింగ్డమ్'(Kingdom Movie Teaser) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే విజయ్ దేవరకొండ ‘డ్రాగన్’ ని మిస్ చేసుకున్నా అభిమానులు ఫీల్ అయ్యేవారు కాదేమో, కానీ ఫ్లాప్ అయితే మాత్రం అభిమానులు చాలా తీవ్రంగా నిరాశకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.
Also Read : పెట్టిన బడ్జెట్ 3 కోట్లు..కానీ ‘డ్రాగన్’ మొదటి వారం రాబట్టిన వసూళ్లు ఏ రేంజ్ లో ఉన్నాయంటే!