War 2 Movie : #RRR , దేవర వంటి వరుస పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్(Junior NTR) చేస్తున్న చిత్రం ‘వార్ 2′(War 2 Movie). బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్(Hritik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇండియన్ రా ఏజెన్సీ లో ఉన్న జవాన్స్ ఎన్టీఆర్ ని మోసం చేసి శత్రు సైన్యానికి వదిలేసి వెన్నుపోటు పొడిచిన కారణంగా, ఇండియా మీద పగతో టెర్రరిస్ట్ గా మారిపోయిన వ్యక్తిగా ఇందులో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. క్లైమాక్స్ లో మంచివాడిగా మారిపోయి తన టెర్రరిస్ట్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడా?, లేక పగతో టెర్రరిస్ట్ గానే మిగిలిపోతాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం ముంబై లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : వార్ 2లో ఎన్టీయార్ పాత్ర కనిపించేది అంత సేపేనా..? మన హీరోల విషయంలో బాలీవుడ్ వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు..?
అయితే ఈ చిత్రం ఆగస్టు 14 న విడుదల చేయబోతున్నట్టు సినిమా షూటింగ్ ని మొదలు పెట్టిన రోజే చెప్పారు మేకర్స్. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అభిమానులు కూడా ఈ సినిమా వాయిదా పడిందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ మూవీ టీం నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే, సినిమాని షెడ్యూల్ చేసిన విధంగానే ఆగస్టు 14 న విడుదల చేయబోతున్నామని, షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ ప్రకారం ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నేడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, లేదా టీజర్ కి సంబంధించి ఏదైనా అప్డేట్ విడుదల అవుతుందని అభిమానులు భావించారు. కానీ అలాంటిదేమి లేదని మూవీ టీం ఖరారు చేసిందట. మరోసారి మూవీ ఆగస్టు 14 న విడుదల అవ్వబోతుంది అని ఖారారు అవ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది,
ఈ సినిమా అభిమానులకు, మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు, అదే విధంగా వాళ్ళిద్దరి మధ్య వచ్చే డ్యాన్స్ ని చూసేందుకు ఆడియన్స్ కి రెండు కళ్ళు చాలవట. ఆ రేంజ్ లో వచ్చినట్టు చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం మొదటి భాగం కంటే అద్భుతంగా ఉంటుందని, సినిమాలో ఇంకా బోలెడన్ని సర్ప్రైజ్ లు ఉంటాయని అంటున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఎన్టీఆర్ ఇంకా ఈ సెట్స్ లోకి అడుగుపెట్టలేదు.
Also Read :