Dragon Collection: ఈ ఏడాది ప్రేక్షకులను, ట్రేడ్ ని ఎంతో సర్ప్రైజ్ కి గురి చేసిన చిన్న చిత్రం ‘డ్రాగన్'(Dragon). తెలుగు లో ఈ చిత్రం ‘ది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon) అనే పేరుతో విడుదలైంది. ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన ఈ సినిమాకు మొదటిరోజు మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా కూడా సగటు యూత్ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండడం తో వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి. కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా ఈ సినిమాకి మూడు రెట్లు లాభాలు వచ్చాయి. అరుదైన విషయం ఏమిటంటే ఈ సినిమా రీసెంట్ గానే తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరో గా నటించిన విడాముయార్చి క్లోజింగ్ వసూళ్లను దాటేసింది.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో వసూళ్ల పై చాలా బలమైన ప్రభావం పడింది. అక్కడి ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు క్లోజింగ్ లో 137 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘డ్రాగన్’ చిత్రానికి తెలుగు, తమిళం భాషలకు కలిపి ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఇంకా మంచి థియేట్రికల్ రన్ ఉండడంతో ఫుల్ రన్ లో మరో 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి 150 కోట్ల రూపాయిల బెంచ్ మార్క్ ని కూడా అందుకుంటుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు లో ఈ సినిమాకు 18 రోజులకు గాను 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
తమిళనాడు లో 74 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయిలు, కర్ణాటక రాష్ట్రంలో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 32 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 69 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఒక చిన్న హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది ఈమధ్య కాలంలో బాగా కామన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్ మొదటి చిత్రం ‘లవ్ టుడే’ కూడా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ హీరో ఇంకో సూపర్ హిట్ పడితే తమిళనాడు యూత్ ఐకాన్ గా మారిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.