Janhvi Kapoor: జాన్వీ కపూర్ సౌత్ లో క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. ఆమె ఫస్ట్ తెలుగు చిత్రం దేవర పాన్ ఇండియా హిట్. వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు దేవర రాబట్టింది. జాన్వీ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా.. స్టార్స్ పక్కన ఛాన్స్ రాలేదు. కమర్షియల్ చిత్రాల్లో నటించింది లేదు. దేవరతో ఆమె కోరిక తీరింది. ఎన్టీఆర్ వంటి బడా స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. దేవర లో జాన్వీ కపూర్ పాత్రకు అంత ప్రాధాన్యత లేకపోవడం నిరాశపరిచే అంశం. అయితే ఆర్సీ 16 రూపంలో మరో భారీ ఆఫర్ ఖాతాలో వేసుకుంది.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ఆర్సీ 16 తెరక్కిస్తున్నాడు. రంగస్థలం తరహా పాత్రలో రామ్ చరణ్ మరోసారి మెప్పించనున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు. రామ్ చరణ్ లుక్, క్యారెక్టరైజేషన్ నెవర్ బిఫోర్ అన్నట్లు ఉంటాయట. ఇక జాన్వీ కపూర్ పాత్ర సైతం చాలా కీలకం అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
ఇక ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం విశేషం. చాలా కాలం తర్వాత ఆయన తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అద్భుతమైన క్యాస్టింగ్, సాంకేతిక నిపుణులతో ఆర్సీ 16 రూపొందుతుంది. అలాగే జాన్వీ కపూర్ కి తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. శ్రీదేవికి సౌత్ లో ఉన్న గుర్తింపు రీత్యా జాన్వీ కపూర్ కి గోల్డెన్ ఆఫర్స్ దక్కుతున్నాయి.
కాగా జాన్వీ కపూర్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. గోల్డ్ కలర్ డిజైనర్ వేర్లో సూపర్ గ్లామరస్ గా జాన్వీ కపూర్ ఉంది. ఆమె నటించిన రూహి సినిమా విడుదలై 4 ఇయర్స్ అవుతున్న సందర్భంగా ఒక ఫోటో షూట్ ని షేర్ చేసింది. అప్పటి జ్ఞాపకాలు ఆమె పంచుకున్నారు. చిన్న వయసు కావడంతో సాంగ్ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని కామెంట్ బాక్స్ లో రాసుకొచ్చింది. జాన్వీ కపూర్ గ్లామరస్ ఫోటోలపై ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ ఫోటో షూట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.