https://oktelugu.com/

Hero: ఈ ఫోటోలో ఉన్న క్రేజీ హీరోని గుర్తు పట్టారా..? ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టాడు!

Hero: ఇటీవల మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరోకి మామూలు క్రేజ్ లేదు. ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 14, 2024 / 03:54 PM IST

    Do you remember the crazy hero in this photo

    Follow us on

    Hero: ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగాడు. తనకు ఎదురైన ఎన్నో అవమానాలు, అవహేళనలు అధిగమించి ముందుకు సాగాడు. కెరీర్ ప్రారంభ దశలో అసలు ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ వంటి సపోర్టింగ్ రోల్స్ చేశాడు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు. మెల్లగా హీరోగా మారాడు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

    ఇటీవల మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరోకి మామూలు క్రేజ్ లేదు. ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఆయన మరెవరో కాదు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. పై ఫొటోలో సిద్దూ లుక్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది.

    Also Read: Jayam Movie: జయం సినిమాకు 22 ఏళ్లు.. నాటి మధుర సంఘటనలు ఇవీ…

    నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో సిద్ధూ లుక్ ఇది. ఈ సినిమాలో సిద్దు నటించాడన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ సినిమాలో సిద్ధూ కనిపించేది చాలా తక్కువ. అది కూడా కబడ్డీ ఆడే సీన్లలో కనిపిస్తాడు. అప్పటికి సిద్దూకి పెద్దగా గుర్తింపు లేకపోవడం తో అతని క్యారెక్టర్ హైలెట్ అవ్వలేదు. సిద్దూ హీరో కాకముందు పలు సినిమాల్లో నటించాడు.

    Also Read: Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠిని ఆ డైరెక్టర్ అంత ఇబ్బంది పెట్టాడా… ఆలస్యంగా విషయం వెలుగులోకి!

    నాగ చైతన్య జోష్, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, భీమిలి కబడ్డీ జట్టు, ఆరెంజ్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో ఫస్ట్ కమర్షియల్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ప్రస్తుతం ‘ జాక్ ‘, ‘ తెలుసు కదా ‘ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్- వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాకి రైటర్ గా వ్యవహరిస్తున్నారు.