Jayam Movie: జయం సినిమాకు 22 ఏళ్లు.. నాటి మధుర సంఘటనలు ఇవీ…

Jayam Movie: ఇక ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2002 వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇక అప్పట్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా నితిన్ ని స్టార్ హీరోని చేయడంలో చాలావరకు హెల్ప్ అయింది.

Written By: Gopi, Updated On : June 14, 2024 1:58 pm

Nithin Debut Movie Jayam Completes 22 Years Of Release

Follow us on

Jayam Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథ చిత్రాలను తీసి ఒక ట్రెండు సృష్టించిన డైరెక్టర్స్ లో తేజ ఒకరు…అప్పట్లో వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.ఇక కొత్త హీరోలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో తేజ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నితిన్ ను హీరోగా సదా ను హీరోయిన్ గా పెట్టి ఆయన చేసిన ‘జయం ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

ఇక ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2002 వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇక అప్పట్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా నితిన్ ని స్టార్ హీరోని చేయడంలో చాలావరకు హెల్ప్ అయింది. ఇక ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయి 22 సంవత్సరాలు అవుతుండడం విశేషం..ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద హీరో నితిన్ స్పందిస్తూ ‘జయం ‘ సినిమా వచ్చి 22 సంవత్సరాలు అవుతుందంటే నాకు నమశక్యంగా అనిపించడం లేదు. ఇక ఈ సినిమా వల్లే నేను స్టార్ హీరోగా ఎదిగాను.

ఈ సినిమాను నాకు అందించిన డైరెక్టర్ తేజ గారికి కృతజ్ఞతలు అంటూ ఈ సినిమా గురించి నితిన్ స్పందించడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి. నిజానికి ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ లవ్ స్టోరీ ని చూడటానికి స్టూడెంట్స్ కాలేజీలు ఎగ్గొట్టి మరి సినిమా ధియేటర్ కి వచ్చారు..ఇక తేజ తన మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సదా ఈ సినిమాలో చెప్పిన ‘వెళ్లవయ్య వెళ్ళు’ అనే డైలాగ్ ను ఇప్పటికీ చాలా మంది వాళ్ల నిత్య జీవితం లో వాడుతుంటారు. ఇక సదా సినిమాలో వాడిన పట్టిలను అప్పట్లో అమ్మాయిలు విపరీతం గా వాడేవారు… ఇలా ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఇదోక మధురానుభూతిని మిగిల్చిందనే చెప్పాలి…

Also Read: Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠిని ఆ డైరెక్టర్ అంత ఇబ్బంది పెట్టాడా… ఆలస్యంగా విషయం వెలుగులోకి!

ఇక ప్రస్తుతానికి నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక అలాగే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించి మరోసారి తను కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక భీష్మ సినిమా తర్వాత నితిన్ కి సరైన సక్సెస్ అయితే పడలేదు.

Also Read: Pawan Kalyan: చెన్నైలో చిరంజీవి కోసం ఒక రౌడీని కొట్టిన పవన్ కళ్యాణ్… హాస్పిటల్ బిల్లు ఎవరు కట్టారంటే..?

ఇక వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆయన ఈ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకుంటేనే మరోసారి తను స్టార్ హీరోగా నిలబడతాడు… లేకపోతే మాత్రం ఇతర హీరోల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడంలో తను కొంతవరకు వెనుకబడిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…