Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని ఆ డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టేశాడట. ఈ విషయాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించింది. లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. టాలీవుడ్ బడా ఫ్యామిలీకి కోడలిగా వెళ్ళింది. వరుణ్ తేజ్ ని పేమించి పెళ్లి చేసుకుంది. మిస్టర్ మూవీలో లావణ్య, వరుణ్ తేజ్ కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వీరు జంటగా నటించారు. ఏళ్ల తరబడి లావణ్య-వరుణ్ రహస్యంగా ప్రేమించుకున్నారు.
గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీ దేశంలో ఘనంగా పెళ్లి జరిగింది. వరుణ్, లావణ్యల వివాహానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. దీంతో ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. లావణ్య, వరుణ్ హాయిగా మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. కాగా లావణ్య చిన్న ప్రమాదానికి గురైంది. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. వైద్యులు బెడ్ రెస్ట్ సూచించడంతో రెస్ట్ తీసుకుంటుంది.
Also Read: Rashmika Mandanna: స్టుపిడ్ ని నమ్మితే భయంకరం… కీలకంగా రష్మిక మందాన కామెంట్స్
ఈ క్రమంలో ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ కీలక విషయాన్ని భయపెట్టింది. మీరు ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో బాగా కష్టపడినది ఏది? అని ఓ నెటిజన్ అడిగాడు. సమాధానంగా లావణ్య త్రిపాఠి… నా మొదటి చిత్రం కోసం చాలా కష్టపడ్డాను. క్యారవాన్ కూడా లేదు. స్టైర్స్ మీద నుండి పడిపోయాను. భాష రాదు. మేకప్, హెయిర్ స్టైలిస్ట్ లేదు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయితే మిథున పాత్ర చేయడాన్ని నేను ఆస్వాదించాను… అని అన్నారు.
Also Read: Devara: ఎన్టీయార్ దేవర సినిమా కంటే వార్ 2 సినిమా పెద్ద విజయం సాధిస్తుందా..?
పరోక్షంగా ఆ చిత్ర డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టేశాడని లావణ్య త్రిపాఠి చెప్పింది. లావణ్య మొదటి చిత్రం అందాల రాక్షసి. ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి. ట్రయాంగిల్ ట్రాజిక్ డ్రామాగా అందాల రాక్షసి తెరకెక్కింది. కొత్త హీరోయిన్ కావడంతో లావణ్యకు కనీసం క్యారవాన్ కూడా ఇవ్వలేదట. నార్త్ అమ్మాయి కావడంతో తెలుగు రాదు. అందాల రాక్షసి చిత్రానికి ముందు లావణ్య పలు సీరియల్స్ లో నటించింది. లావణ్య భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా వంటి చిత్రాల్లో నటించింది.