Kasturi Pasupu: కస్తూరి పసుపు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

కస్తూరి పసుపుని ఫేస్‌ప్యాక్‌ మాదిరి వాడటం వల్ల ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. కస్తూరి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Written By: Swathi Chilukuri, Updated On : June 14, 2024 3:45 pm

Kasturi Pasupu

Follow us on

Kasturi Pasupu: అందంగా కనిపించాలన్నా మొహం మెరవాలి అన్నా ఇప్పుడు మార్కెట్లో చాలా క్రీములు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటికి బదులు కస్తూరి పసుపు వాడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది దీనిని ఎన్నో రోజులుగా వాడుతున్నారు. చాలా ఔషధ గుణాలున్న కస్తూరి పసుపు చర్మ అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ కస్తూరి పసుపు ఫేస్ ప్యాక్ ను ఎలా వాడాలి.. వాడితే ఎలాంటి లాభాలున్నాయో అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కస్తూరి పసుపుని ఫేస్‌ప్యాక్‌ మాదిరి వాడటం వల్ల ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. కస్తూరి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు కూడా దూరం అవుతాయి. మొహం మృదువుగా మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్న కస్తూరి పసుపు చర్మ ఇన్ఫెక్షన్స్, సమస్యల్ని దూరం చేయడంలో చాలా పని చేస్తుంది. చర్మ రంగుని మార్చి.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ కస్తూరి పసుపు.

కొంతమంది ఆడవారికి అన్‌వాంటెడ్ హెయిర్ వస్తుంటుంది. వీటిని దూరం చేయడానికి కూడా ఈ కస్తూరి పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కస్తూరి పసుపులో శనగపిండి, పాలు కలిపి ప్యాక్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కస్తూరి పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ని దూరం చేసి.. చర్మంపై ముతలు, ఫైన్‌లైన్స్ ను రాకుండా చేస్తాయి. డార్క్ స్పాట్స్ కూడా దూరమై యవ్వనంగా కనిపిస్తారు.

ముఖం కాంతివంతంగా మెరవాలని కోరుకునే వారు కస్తూరి పసుపుని వాడితే మంచి గ్లో వస్తుంది. డార్క్ స్కిన్ ప్రాబ్లమ్ కూడా చాలా త్వరగా దూరం అవుతుంది. అందుకే ఈ కస్తూరి పసుపును రెగ్యులర్‌గా వాడండి. దీనిని వాడటం వల్ల పొల్యూషన్ వల్ల కలిగే స్కిన్ డ్యామేజీని సమస్య కూడా దూరం అవుతుంది. కస్తూరి పసుపులో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ దూరమవుతాయి.