https://oktelugu.com/

Ramya Krishnan: రమ్యకృష్ణ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించింది రమ్యకృష్ణ. 1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అంటూ ఎన్నో ఇండస్ట్రీలలో అనేక సినిమాలతో హిట్లను సంపాదించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 15, 2024 / 03:24 PM IST

    Ramya Krishnan

    Follow us on

    Ramya Krishnan: ఓ అల్లరి చందమామ, రెండు జడల హీరోయిన్, కానీ ఇప్పుడు ఓ శివగామీ, స్టార్ సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్, ఇప్పటి స్టార్ హీరోయిన్ లకు మోస్ట్ వాంటెడ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్. ఎవరో ఇప్పటికీ గుర్తు వచ్చే ఉంటుంది. అదేనండి రమ్యకృష్ణ. 90’s లో అడియన్స్ కు కంటిచూపుతోనే భయపెట్టేది ఈ నీలాంబరి. నిజమే మరీ.. అందమే కాదు.. కళ్లతోనూ అద్భుతంగా నటించే సత్తా ఉన్న అప్పటి స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాలు.. మరెన్నో పాత్రలు ఆమెను తెలుగు వారికి చాలా దగ్గర చేశాయి.

    1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించింది రమ్యకృష్ణ. 1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అంటూ ఎన్నో ఇండస్ట్రీలలో అనేక సినిమాలతో హిట్లను సంపాదించింది. ఎనిమిదో తరగతి చదువుతూన్న సమయంలోనే వెల్లై మనసులో ప్రధాన పాత్ర పోషించి మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత బాల మిత్రులు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది రమ్యకృష్ణ. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి తనదైన ముద్ర వేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి అందరి స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

    హీరోయిన్ గా మాత్రమే కాదు విలన్ పాత్రను ఇచ్చినా సరే అద్భుతంగా నటిస్తుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ రజినీకాంత్, సౌందర్య జంటగా నటించిన నరసింహ సినిమా. ఇందులో నీలాంబరి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా రమ్యకృష్ణకు మంచి పేరును సంపాదించి పెట్టింది. ప్రస్తుతం తల్లిగా, అత్తగా నటిస్తుంది. దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ నటి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించింది.

    ఇన్ని సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించిన రమ్యకృష్ణ ఆస్తి ఎంత ఉంటుందని సర్చ్ చేస్తున్నారు అభిమానులు. అయితే రమ్యకృష్ణ నికర విలువ రూ.90 కోట్లని టాక్. అలాగే ఇప్పుడున్న నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కూడా పేరు సంపాదించింది. ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ. 4 కోట్ల వరకు అందుకుంటుంది. అలాగే ఎండార్స్‌మెంట్‌లు, వాణిజ్య ప్రకటన కోసం అధికంగా ఛార్జ్ చేస్తుంటుందట.