https://oktelugu.com/

Shobana: ఆ హీరో మోసం చేయడం వల్లే పెళ్లి చేసుకోకుండా ఒంటరి గా ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

శోభన తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న శోభన ఇప్పటికి కూడా తను పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది.

Written By:
  • Gopi
  • , Updated On : June 15, 2024 1:48 pm
    Shobana

    Shobana

    Follow us on

    Shobana: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక్క సినిమా సక్సెస్ అయితే ఎంత క్రేజ్ వస్తుందో, ఇక ఒక్క సినిమా ఫ్లాప్ తో వచ్చిన అవకాశాలన్ని కూడా చేజారిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హీరోయిన్ రాణించాలంటే వాళ్ళు చేసే సినిమాలు మంచి సక్సెస్ లు సాధిస్తూ ఉండాలి. అలాంటి సందర్భంలోనే వాళ్ళు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతారు.

    అంతే తప్ప ఏదో టైం పాస్ కోసం సినిమాలు చేస్తే మాత్రం వాళ్ళకి ఇక్కడ మంచి గుర్తింపు అయితే రాదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శోభన తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న శోభన ఇప్పటికి కూడా తను పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. అయితే తను సింగిల్ గా ఉండడానికి గల కారణం ఏంటి అంటూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శోభన తను హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే ఒక హీరోని ప్రేమించింది.

    ఇక తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఆ హీరో మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదట. ఇక దాంతో లైఫ్ లో ప్రేమ, పెళ్లి జోలికి పోకూడదని వాటి మీద అసహ్యం పెంచుకొని తను సింగిల్ గానే ఉండాలని అనుకుంటుందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక ఈవిడ 1982 వ సంవత్సరంలో వచ్చిన ‘భక్త దృవ మార్కండేయ’ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆమెకు నాగార్జునతో చేసిన విక్రమ్ సినిమాతోనే మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె రుద్రవీణ, అభినందన, ఏప్రిల్ ఒకటి విడుదల, రౌడి అల్లుడు, నిప్పు రవ్వ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులోనే కాకుండా ఆమె తమిళం లో కూడా దళపతి లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలో నటించి నటిగా మంచి పేరు అయితే సంపాదించుకుంది.

    ఇక ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం తెలుసుకున్న ఆమె అభిమానులు ఈ రోజుల్లో ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకుంటూ ఉండే మనుషుల మధ్యన ప్రేమించిన వ్యక్తి కోసం అలాగే ఒంటరిగా ఉండిపోయిన శోభన గారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లైతే పెడుతున్నారు. ఇక ప్రస్తుతం శోభన ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది…