Jawan: ‘జవాన్’ లో షారుఖ్ ఖాన్ ఎందుకు గుండు పాత్ర ఒప్పుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా ద్వారా సౌత్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ వారికి పరిచయమయ్యారు.

Written By: Swathi, Updated On : September 18, 2023 2:04 pm

Jawan

Follow us on

Jawan: హీరోలు తమ సినిమాల్లో తాము ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు కథపరంగా ఆయన ఎక్స్పరిమెంట్ చేస్తారేమో కానీ తమ లుక్స్ పరంగా మాత్రం ఎక్స్పరిమెంట్లు చెయ్యడానికి ఇష్టపడరు. కానీ కొంతమంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటాడు. ఆ మధ్యకాలంలో రజినీకాంత్ శివాజీ సినిమా కోసం గుండు పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు అలానే చేశారు మన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.

ప్రస్తుతం జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా ద్వారా సౌత్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ వారికి పరిచయమయ్యారు. షారుక్ ఖాన్ హీరోగా చేసిన ఈ సినిమాలో నయనతార, దీపికా పడుకొనే, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో కనిపించాడు.

ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేయగా.. కొద్దిసేపు పాటు ఈ చిత్రంలో ఈయన గుండెలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ లోనే దర్శకుడు షారుక్ గుండు లుక్ రివిల్ చేశారు. అప్పటినుంచి ప్రేక్షకులు అసలు షారుక్ ఎందుకు గుండు లుక్ ఒప్పుకున్నారు అని తెగ షాక్ కి గురయ్యారు. ఇక తాను ఎందుకు ఒప్పుకున్నారో ఇన్ని రోజులకు ప్రేక్షకులకు తెలియజేశారు షారుక్.

కాగా అసలు ఈ హీరో ఎందుకు ఈ పాత్ర ఒప్పుకున్నారో తెలిస్తే తప్పకుండా షాక్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే షారుక్ కేవలం తన బద్ధకం వల్ల ఇలా ఒప్పుకున్నారట. ‘బద్ధకం వల్లే నేను ఈ గుండు లుక్ ని ఎంచుకున్నాను. ఎందుకంటే ఇలాంటి లుక్ సెలెక్ట్ చేసుకుంటే నేను రెండు గంటలు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ లుక్ లోనే కొన్ని సీన్స్ చేశాను. ఈ లుక్ కి సంబంధించిన కొన్ని ప్రోమోస్ ని మా ఫ్రెండ్స్ కి చూపించాను. అది చూసి ఈ లుక్ చాలా భయంకరంగా ఉంది. అమ్మాయిలైతే నిన్ను అస్సలు లైక్ చేయరు అని చెప్పడంతో, కచ్చితంగా ఈ లుక్ లో అమ్మాయిలు నన్ను ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. నన్నే కాదు గుండుతో ఉన్న మగాళ్లను అమ్మాయిలు ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా గుండుతో ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం అంటూ నేను నా ఫ్రెండ్స్ కి చెప్పుకోచ్చాను’ అని అసలు విషయం బయటపెట్టారు షారుక్.