Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ చేసాడు కానీ, ద్విపాత్రాభినయం మాత్రం ఒక్క సినిమాలో కూడా చేయలేదు. ఏ డైరెక్టర్ కి కూడా ఇప్పటి వరకు ఆయనతో అలాంటి ప్రయోగం చేయలేదు. కానీ పుష్ప నుండి అల్లు అర్జున్ ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. త్వరలోనే ఆయన తమిళ స్టార్ దర్శకుడు అట్లీ(Director Atlee) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అట్లీ గత చిత్రం ‘జవాన్'(Jawan Movie) లో కూడా షారుఖ్ ఖాన్(Sharukh Khan) ని ద్విపాత్రాభినయం లో చూపించాడు. ఫ్యాన్స్ తమ హీరో ని అలా చూసేలోపు మెంటలెక్కిపోయారు. సరికొత్త థియేట్రికల్ అనుభూతితో బయటకు వచ్చారు. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా కూడా అభిమానులకు అలాంటి అనుభూతి కలిగిస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో 5 మంది హీరోయిన్లు, ఇద్దరు హీరోలు..అసలు ఇదేమి ప్లానింగ్ బాబోయ్!
‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడంతో ఆయన అట్లీ చిత్రాన్ని పూర్తి చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇటీవల కాలం లో ఈ సినిమా మీద వచ్చినన్ని వార్తలు ఏ సినిమా మీద కూడా రాలేదు అనడంలో అతిశయోక్తి లేదేమో. ఇందులో అల్లు అర్జున్ మాత్రమే కాదు, మరో హీరో కూడా ఉంటాడు, ఆ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ అని ఒకరు, ఇందులో శివ కార్తికేయన్ కూడా ఉంటాడని మరికొందరు, ఈ చిత్రం లో ఏకంగా 5 మంది హీరోయిన్లు ఉంటారని మరికొందరు, ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఏది కూడా అధికారికంగా తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ అంటున్నారు, ఇది కూడా అనధికారిక వార్తనే.
వీటిని అన్నిటికి ఫుల్ స్టాప్ పడాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని అంటున్నారు విశ్లేషకులు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ సినిమాని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడట అల్లు అర్జున్. ఆ తర్వాత వెంటనే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోయే మైథలాజి చిత్రానికి షిఫ్ట్ అవుతాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఆయన సందీప్ వంగ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇలా రాబోయే మూడేళ్ళ వరకు అల్లు అర్జున్ డైరీ మొత్తం ఫుల్. చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన తన రేంజ్ ని ఇంకా ఎంత పెంచుకోబోతున్నాడు అనేది.
Also Read : అల్లు అర్జున్ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయి రేంజ్ అప్డేట్ రెడీ!