Samantha- Naga Chaitanya: టాలీవుడ్ లో చిలకా-గోరింకలలాగా కలిసి ఉన్న జంట నాగచైతన్య-సమంత జోడి. ఎవరికి కన్ను కుట్టిందో కానీ అర్ధాంతరంగా విడిపోయి టాలీవుడ్ లో అతిపెద్ద వివాదాన్ని సృష్టించారు. ఇప్పటికీ సమంత విడిపోవడానికి గల కారణంపై రకరకాలుగా రాసుకొచ్చారు. కొందరైతే సమంత స్టైలిష్ కారణమని.. అతడితో సన్నిహితంగా ఉన్న వారి ఫొటోలు షేర్ చేశారు. ఇక సమంతకు మరొకరితో ఎఫైర్ ఉందని గాసిప్సులు సృష్టించారు.

ఎందుకోగానీ నాలుగేళ్లు కలిసి కాపురం చేసినా ఈ జంట పిల్లలను కనలేదు. ఆ విషయంలో చైతన్యకు ఇష్టం లేదా? లేక సమంత వద్దనుకుందా? అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఎవరికి తోచినట్టు వారు రాసేసి సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. ఇది చాలదన్నట్టు తాజాగా మరో గాసిప్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. సమంత-చైతన్య విడిపోవడానికి ఆ హీరోయిన్ కారణం అంటూ ఆడిపోసుకుంటున్నారు.
Also Read: America- China: డ్రాగన్ ను మళ్లీ గిల్లుతున్న అమెరికా: ఈసారి తైవాన్ కు 8.7 వేల కోట్ల ఆయుధాల విక్రయం
‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో పవన్ కళ్యాణ్ సరసన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కినేని ఇంటి బిడ్డ సుప్రీయ. అక్కినేని నాగార్జున మేనకోడలు అయిన ఈమె ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. అయితే భర్తతో పడక విడిపోయింది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది.
అడవి శేష్ హీరో నటించే సినిమాల్లో సుప్రియ కీలక పాత్రలు పోషిస్తుంటుంది. దీంతో వీరిద్దరికి ఎఫైర్ ఉందని.. పెళ్లికి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అక్కినేని నాగార్జున వద్ద వీరి పెళ్లిపై పంచాయితీ జరిగిందని.. అప్పుడు సమంతనే అడవిశేష్ తో సుప్రియ మ్యారేజ్ వద్దని.. శేష్ కు మొదటి పెళ్లి.. సుప్రియకు రెండో పెళ్లి అవసరమా? అంటూ వ్యతిరేకించిందట.. సమంత వల్లే వీరి పెళ్లి ఓకే కాలేదన్నది సోషల్ మీడియా టాక్..

ఇప్పుడు సమంత-నాగచైతన్య కాపురం కూలిపోవడానికి కూడా సుప్రీయ కారణమని.. తన పెళ్లి కాకుండా చేసిన సమంతపైన ఈమె ప్రతీకారం తీర్చుకొని విడిపోయేలా ప్రోత్సహించిందన్నది ప్రచారం..
ఇదంతా నిజమా? అబద్దమో ఎవరికీ తెలియదు.. కానీ చైతన్య-సమంత విడిపోవడానికి అక్కినేని మేనకోడలు సుప్రియ కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇలాంటి గాలివార్తలు చాలా ప్రచారం సాగాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది వేచిచూడాలి.
Also Read:Anand Mahindra : మనల్ని పాలించిన బ్రిటీషోళ్లను దాటేశాం.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే