America- China: చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న గిల్లుడు వ్యవహారం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. పైగా ఇరుదేశాలు ఒకరి దాంట్లో ఒకరు వేలు పెడుతుండడంతో పరిస్థితి నానాటికి చేయి దాటుతోంది. మొన్నటికి మొన్న టిబెట్లో అమెరికా చట్టసభల ప్రతినిధి పర్యటించారు. దీనిని చైనా పూర్తిగా వ్యతిరేకించింది. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికాను హెచ్చరించింది. అయినప్పటికీ అమెరికా లెక్క చేయలేదు. పైగా చైనా దేశంలో ప్రజాస్వామ్య విలువలు అంతకంతకు దిగజారుతున్నాయని ఆరోపించింది. చైనా హెచ్చరిస్తే తాము భయపడి పారిపోయే వాళ్ళం కాదని స్పష్టం చేసింది. అయితే కొన్ని రోజులు మౌనంగా ఉన్న అమెరికా మళ్లీ చైనాను గెలికే ప్రయత్నం చేసింది. ఈసారి తైవాన్ మీదుగా డ్రాగన్ ను గిల్లింది.

8.7 వేలకోట్ల ఆయుధాల విక్రయం
తాను తయారు చేస్తున్న ఆయుధాలలో ఎక్కువ శాతం విక్రయాలు జరుపుతున్న అమెరికా..ఈసారి తైవాన్ కు ₹ 8.7 వేల కోట్ల ఆయుధాలు విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఇటీవల చైనా తయారు చేసిన ఆయుధాలపై రష్యా, బంగ్లాదేశ్ అభ్యంతర వ్యక్తం చేశాయి. ఇందుకు కారణం వాటిలో నాణ్యత లేకపోవడమే. అయితే చైనా కంటే తాము నాణ్యమైన అధునాతన ఆయుధాలను తయారు చేస్తున్నామని ప్రపంచానికి చాటేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
Also Read: Hotel Secrets: రాత్రిపూట ఈ హోటల్లో జరిగే 5 వింత రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు..
భాగంగానే తైవాన్ కు అత్యంత ఆధునికమైన ఆయుధాలను విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఇటీవల తైవాన్ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తూ చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో తైవాన్ దేశం తనను తాను రక్షించుకునేందుకు యాంటీ షిప్, ఎస్ఏఎం, గగనతల మిస్సైళ్లు, రాడార్ హెచ్చరిక వ్యవస్థ వంటి వాటిని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుధాల విలువ 8.7 వేల కోట్లు ఉంటుందని అమెరికా రక్షణ విభాగ అధికారులు చెప్తున్నారు. అయితే ఆగస్టు నెలలో అమెరికా చట్టసభల స్పీకర్ నాన్సీ ఫెలోసి తైవాన్ లో పర్యటించారు.

నాన్సీ పర్యటనను డ్రాగన్ వ్యతిరేకించింది. ఈ పరిణామం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో తైవాన్ ను హెచ్చరించే ఉద్దేశంతో ఆ దేశ సరిహద్దుల వెంట చైనా సైనికులు భారీ విన్యాసాలు చేశారు. ఇలా ఉప్పు, నిప్పుగా పరిణామాలు ఉన్న నేపథ్యంలో తైవాన్ కు అమెరికా ఆయుధాల విక్రయ నిర్ణయం డ్రాగన్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరింది. లేకుంటే ప్రతి చర్య తప్పదని జో బైడన్ ను హెచ్చరించింది. అమెరికా చైనాల మధ్య ఉన్న ఒప్పందాల పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని డ్రాగన్ ప్రతినిధి లీ పెంగ్యు హెచ్చరించారు. కాగా రెండు అగ్ర దేశాలు పంతాలకు పోతే ఆ ప్రభావం ప్రపంచం మీద ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రష్యా _ ఉక్రెయిన్ యుద్ధం వల్ల నానా ఇబ్బందులు పడుతున్న దేశాలు.. చైనా _ అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మరింత అగాథం లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే చైనా హెచ్చరికల నేపథ్యంలో తైవాన్ కి అమెరికా ఆయుధాలు విక్రయిస్తుందా? లేదా అనే దానిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Also Read:Puri Jagannadh- Charmi: విజయ్ తో ‘జనగణమన’ ఆపేసిన పూరి.. బాధతో చార్మి షాకింగ్ నిర్ణయం
[…] […]
[…] […]