https://oktelugu.com/

Prabhas And Rana: ప్రభాస్ , రానాల ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఎవరో తెలుసా..?

ప్రభాస్ తో పాటు రానా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి బాహుబలి సినిమాలో నటించి ఇప్పించారు.అయితే రానాకి కూడా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నట్టుగా చాలా వార్తలు అయితే వచ్చాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 22, 2024 / 10:41 AM IST

    Prabhas And Rana

    Follow us on

    Prabhas And Rana: ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్…ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వర్షం సినిమాతో యావత్ తెలుగు ప్రేక్షకులందరిని ఆకర్షించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన రాజమౌళితో చేసిన ఛత్రపతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.

    ఇక ఆ తర్వాత నుంచి వెను తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించి యావత్ ఇండియన్ జనాలని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో మరొకసారి 700 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఆరోగ్యం బాగా చెడిపోయిందనే విషయమైతే ఆయనను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక ఇంతకుముందు ఆయన ఫేస్ లో ఉన్న గ్లో ఇప్పుడు కనిపించడం లేదు. కాబట్టి కొంతవరకు ఆయన ఆరోగ్యం అయితే చెడిపోయింది అనే వార్తలు వస్తున్నాయి.

    ఇక ప్రభాస్ తో పాటు రానా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి బాహుబలి సినిమాలో నటించి ఇప్పించారు.అయితే రానాకి కూడా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నట్టుగా చాలా వార్తలు అయితే వచ్చాయి. ముఖ్యంగా ఆయన కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల లండన్ వెళ్లి వేరే వాళ్ళ కిడ్నీ కూడా మార్పిడి చేసుకున్నాడు. దాంతో ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బాహుబలి సినిమా తర్వాత మాత్రం బాగా వీక్ గా అయిపోయాడు. దానికి కారణం కిడ్నీ డ్యామేజ్ అవ్వడమే అంటూ డాక్టర్లు చెప్పడంతో కిడ్నీ ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు…

    అయితే వీళ్ళిద్దరి ఆరోగ్యం చెడిపోవడానికి ముఖ్య కారణం ఎవరు అంటే రాజమౌళి అనే చెప్పాలి. ఇక బాహుబలి సినిమా కోసం వీళ్ళ చేత ఇష్టం వచ్చిన ఫుడ్ తినిపించి 15 నుంచి 20 గంటలు జిమ్ములోనే గడిపే విధంగా ట్రైనింగ్ ఇవ్వడంతో బాగా జిమ్ చేసి బాడీని ఫిట్ చేసిన వీళ్ళు ఆ తర్వాత ఆ బాడీ ని కంటిన్యూ చేయకపోవడంతో వాళ్ళ హెల్త్ మీద ఎఫక్ట్ కొట్టింది అంటూ చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. వీళ్ళిద్దరి హెల్త్ లు బాగా దెబ్బతినడానికి కారణం రాజమౌళి అంటూ ఆయన మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు…