https://oktelugu.com/

Tollywood Pan India Movie: ప్రభాస్ కంటే ముందే పాన్ ఇండియా సినిమా చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

ఒకప్పుడు తెలుగులో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చారు. ఇక అందులో బాగానే వీళ్లు చేసిన సినిమాలు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా డబ్ చేస్తూ ఉండేవారు.

Written By: , Updated On : January 22, 2024 / 10:37 AM IST
Tollywood Pan India Movie

Tollywood Pan India Movie

Follow us on

Tollywood Pan India Movie: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి నలుగురు హీరోలు సినిమా ఇండస్ట్రీ బాధ్యతలు మొత్తాన్ని మోస్తూ ఉండేవారు. వీళ్లు చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు వెళ్లేలా చేసిన ఈ నలుగురు హీరోలు ఇప్పటికీ కూడా స్టార్ హీరోలు గానే కొనసాగుతున్నారు.

ఇక ఇలాంటి ఈ హీరోలు ఒకప్పుడు తెలుగులో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చారు. ఇక అందులో బాగానే వీళ్లు చేసిన సినిమాలు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా డబ్ చేస్తూ ఉండేవారు. అయితే అవి పెద్దగా వర్కవుట్ కాకపోవడం తో ఓన్లీ తెలుగు లో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక నాగార్జున మాత్రం 1997వ సంవత్సరంలో ప్రవీణ్ గాంధీ దర్శకత్వం లో వచ్చిన రక్షకుడు సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేశాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సుస్మితాసేన్ నటించింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి.

Tollywood Pan India Movie

Tollywood Pan India Movie

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని రిలీజ్ చేస్తే రిలీజ్ అయిన అన్ని చోట్లలో కూడా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం ఒకటైతే సినిమాలోని కథ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవడమే దానికి ముఖ్య కారణం అంటూ మరి కొంతమంది విమర్శకులు చేశారు. అయితే ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మాత్రం చాలా బాగా ప్లస్ అయిందనే చెప్పాలి.

ప్రతి సాంగ్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాయి. ఇక ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి మరొక కారణం ఈ సినిమా సాంగ్స్ అనే చెప్పాలి. ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్ అవడంతో జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారినప్పటికీ 1997 వ సంవత్సరం లోనే నాగార్జున రక్షకుడు సినిమాతో మొదట పాన్ ఇండియా స్టార్ హీరోగా చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు…