HomeజాతీయంRam Mandir: 32 ఏళ్ల మోదీ శపథం నేడు సాకారం..!!

Ram Mandir: 32 ఏళ్ల మోదీ శపథం నేడు సాకారం..!!

Ram Mandir: లోకాల దేవుడు.. జగదభిరాముడు పుట్టిన నేల అయోధ్య. ఆ నేలపై 500 ఏళ్ల తర్వాత బాల రాముడు కోలువుదీరనున్నాడు. మరికొన్ని గంటల్లో భారతీయ హిందువు స్వప్నం సాకారం కాబోతోంది. దీంతో దేశం మొత్తం రామనామంతో పులకరిస్తోంది. జగమంతా రామోత్సవం జరుపుకుటోంది. అయోధ్యలో ఆవిష్కృతమయ్యే అపురూప ఘట్టానికి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి తరలి వస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రామాలయం వెనుక ప్రధాని నరేంద్రమోదీ 32 ఏళ్ల నాటి శపథం ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మించే తిరిగి అయోధ్యకు వస్తానని మోదీ ప్రతిజ్ఞ చేశారు. నేడు అదే మోదీ రామాలయం ప్రారంభిస్తున్నారు.

అందరి చూపు అయోధ్యవైపే..
అయోధ్య రామాలయం కోట్లాది మంది హిందువుల ఆకాంక్ష. సుదీర్ఘ పోరాటం, న్యాయ వివాదాలను దాటుకుని జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం అవుతోంది. సుప్రీం న్యాయ పరిష్కారంతో అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం జరిగింది. ఈ సంకల్పం వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయ.

Ram Mandir
Ram Mandir

32 ఏళ్ల సంకల్పం..
ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామాలయ నిర్మాణం ఒక సంకల్పంగా పెట్టుకున్నారు. 32 ఏళ్ల క్రితం శపథం చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించిన తరువాతనే తిరిగి తిరిగి వస్తానని ప్రతిన బూనారు. ఇప్పుడు అది నిజమైంది. నేడు కోట్లాది మంది ప్రజల సాక్షిగా మోదీ అయోధ్యలో రామ్‌ లల్లాకు ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు.

నాటి ప్రతిజ్ఞ ఇదీ..
32 ఏళ్ల క్రితం మోదీ అయోధ్యకు వచ్చారు. నాడు అక్కడి పరిస్థితులను చూసి మోదీ చేసిన ప్రతిజ్ఞ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 32 ఏళ్ల క్రితమే మోదీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. రామ మందిరం గురించిన సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేశారు. ఈ క్రమంలో అయోధ్యకు చేరుకున్నారు. రామజన్మభూమి ప్రాంతంలో పర్యటనకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న పరిస్థితులపై స్పందించాడు. జై శ్రీరామ్‌ నినాదాల మధ్య ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడే తిరిగి వస్తానని ప్రతిన బూనారు. అది నిజమైంది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో రామాలయ నిర్మాణానికి ప్రధాని హోదాలో మోదీనే 2022, ఆగస్టు 5న భూమి పూజ చేశారు.

నేడు బాల రాముడి ప్రతిష్టాపన..
శరవేగంగా రామాలయ నిర్మాణం పూర్తి చేసిన మోదీ.. భవ్య రామ మందిరలో బాల రాముడిని ప్రతిష్టించబోతున్నారు. ఈమేరకు అయోధ్యలో ఏర్పాట్లు చేశారు. అతిథులు, సాధువులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. యావత్‌ ప్రపంచం చూపు ఇప్పుడు అయోధ్యవైపే ఉంది. ఇదిలా ఉండగా అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం మోదీ అనుష్టానం చేస్తున్నారు. రామునితో అనుబంధం ఉన్న రామాలయాలను సందర్శిస్తున్నారు. మరోవైపు దేశం నలుమూలల నుంచి విలువైన వస్తువులు అయోధ్యకు చేరుకుంటున్నాయి. గుజరాత్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్‌ నుంచి దీపాలు, ధూపం బత్తీలు అయోధ్యకు చేరుకున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version