spot_img
Homeఎంటర్టైన్మెంట్Sitara: మహేష్ బాబు కాకుండా సితార కి బాగా ఇష్టమైన టాలీవుడ్ హీరో అతనేనా..? ఇది...

Sitara: మహేష్ బాబు కాకుండా సితార కి బాగా ఇష్టమైన టాలీవుడ్ హీరో అతనేనా..? ఇది నిజంగా ఎవ్వరూ ఊహించి ఉండరు!

Sitara: ఒక్క సినిమాలో కూడా నటించకుండా, కేవలం సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న స్టార్ కిడ్స్ లో ఒకరు సితార ఘట్టమనేని. మహేష్ బాబు కూతురిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ అమ్మాయి కొన్నేళ్ల క్రితమే సోషల్ మీడియా లోకి అడుగుపెట్టి అభిమానులకు మరింత చేరువ అయ్యింది. తనకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు ఈమె తన స్నేహితురాలు ఆద్య తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతుంది. ఈ ఛానల్ ని చూస్తే ఎవరైనా షాక్ కి గురి కాక తప్పదు. సితార లో చిన్నతనం నుండే ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతారు. రకరకాల వంటకాలతో పాటు, పెద్దవాళ్ళు చేసే పనులు కూడా ఈ అమ్మాయి చిన్నతనంలోనే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అలాగే ఈ అమ్మాయికి డ్యాన్స్ మీద ప్రత్యేకమైన ఇష్టం ఉండడాన్ని మనం గమనించొచ్చు. ఇండస్ట్రీ లో కొత్తగా వచ్చి సూపర్ హిట్స్ గా నిల్చిన పాటలకు ఎప్పటికప్పుడు డ్యాన్స్ వేస్తూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటుంది. క్లాసిక్ డ్యాన్స్ తో పాటుగా, మోడరన్ డ్యాన్స్ కూడా ఈ అమ్మాయికి వచ్చు. మహేష్ బాబు ఆ డ్యాన్స్ వీడియోలను ఎన్నోసార్లు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ మురిసిపోయాడు. ఇవన్నీ పక్కన పెడితే సితార కి బాగా ఇష్టమైన హీరో ఎవరో కనుక్కోండి చూద్దాం అంటే, మన అందరం మహేష్ బాబు పేరే చెప్తాము. నిజమే, ఆమె అభిమాన హీరో ముమ్మాటికీ మహేష్ బాబే, కానీ మహేష్ కాకుండా బయట హీరోల్లో ఆమెకి బాగా ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ అట. ఇది ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. ఆయన నటించిన ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలంటే సితార కి చాలా ఇష్టమట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన సంక్రాంతికి ‘గుంటూరు కారం’ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు కానీ, మహేష్ నటనకి మాత్రం అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందారు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చేయబోతున్నాడు. స్క్రిప్ట్ దశలోనే ఉన్న ఈ చిత్రం, ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో నిర్వహిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ జానర్ ని పూర్తిగా మార్చేసి, ఎప్పటి నుండో తన డ్రీం ప్రాజెక్ట్ గా అనుకుంటున్న ‘గరుడ’ చిత్రాన్ని మహేష్ తో చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version