Devara: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో ‘దేవర’ చిత్రం తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి మార్కెట్ లో రోజురోజుకి క్రేజ్ పెరుగుతూ వెళ్తుంది. వచ్చే నెల 27 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి ఇప్పటి నుండి ఫ్యాన్ షోస్ ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే లండన్ లో పలు లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, 3 వేల పౌండ్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ కూడా కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ షోస్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా షోస్ మార్చి 27 అర్థ రాత్రి 1 గంట నుండి ప్రారంభం అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
ఇదే అభిమానులను వణుకుపుట్టిస్తున్న విషయం. ఎందుకంటే మన టాలీవుడ్ లో అర్థ రాత్రి నుండి షోస్ ప్రారంభమై టాక్ తెచ్చుకున్న చిత్రాలు చాలా తక్కువ ఉన్నాయి. ‘సలార్’, ‘బాహుబలి 2’ వంటి చిత్రాలకు మాత్రమే ఈ అర్థరాత్రి షోస్ వర్కౌట్ అయ్యాయి. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలకు మాత్రం ఈ అర్థరాత్రి షోస్ బాగా దెబ్బ వేసాయి. ముఖ్యంగా ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి అర్థరాత్రి షోస్ నుండి వచ్చిన డిజాస్టర్ టాక్ ని చూసి అభిమానులు హడలిపోయారు. దాని ప్రభావం సినిమా వసూళ్లపైన పడింది. మ్యాట్నీ షోస్ నుండి అనేక ప్రాంతాలలో డ్రాప్స్ పడ్డాయి. అలాంటి పరిస్థితి ‘దేవర’ చిత్రం కి కూడా వస్తుందేమో అని ఎన్టీఆర్ అభిమానులు భయపడుతున్నారు.
అయితే మరికొంతమంది మాత్రం సినిమా కంటెంట్ మీద మేకర్స్ కి బలమైన విశ్వాసం ఉందని, అందుకే అర్థ రాత్రి నుండే షోస్ ప్రారంభిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు. ఇందులో రెండు విభిన్నమైన లుక్స్ లో ఎన్టీఆర్ ని అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ ‘దేవర’, ‘వర’ అని ద్విపాత్రాభినయం చేసాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ‘దేవర’ పాత్ర సినిమాకి హైలైట్ ఉండబోతుందని, ఎన్టీఆర్ ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నారో, కొరటాల శివ ఆ రేంజ్ కి మించే చూపించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు అభిమానుల నుండి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సౌత్ ఇండియన్ ఆడియన్స్ ని షేక్ చేసే మరో పాటని సినిమా విడుదలకు వారం రోజుల ముందు విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. ‘ఆయుధ పూజ’ అని పిలవబడుతున్న ఈ పాట విడుదలయ్యాక ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలను ఫ్యాన్స్ మర్చిపోతారని, ఆ స్థాయిలో ఆ పాట ఉంటుందని అంటున్నారు.