https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘సరిపోదా శనివారం’ సంచలనం..ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే!

ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ అయితే రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. అందుకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా నాని గత చిత్రాలకంటే బాగా జరిగింది. బిజినెస్ కి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం 'దసరా' ప్రీమియర్ గ్రాస్ ని దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 27, 2024 / 02:07 PM IST

    Saripodhaa Sanivaaram

    Follow us on

    Saripodhaa Sanivaaram: సినిమా సినిమాకి తనలోని కొత్త కోణాన్ని ఆడియన్స్ కి పరిచయం చేస్తూ, తన మార్కెట్ పరిధి ని పెంచుకుంటూ ముందుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ చిత్రంతో మన ముందుకు మరో రెండు రోజుల్లో రాబోతున్న సంగతి తెలిసిందే. ‘అంటే సుందరానికి’ చిత్రం తర్వాత వివేక్ ఆత్రేయ తో నాని చేస్తున్న రెండవ సినిమా ఇది. ‘అంటే సుందరానికి’ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం కి ఓటీటీ విడుదల తర్వాత ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వివేక్ ఆత్రేయ లో కచ్చితంగా విషయం ఉంది అని నాని తో ఆడియన్స్ కూడా నమ్మారు. అందుకే నాని ఆయనకి రెండవసారి అవకాశం ఇచ్చాడు, ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడేలా చేసారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ అయితే రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. అందుకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా నాని గత చిత్రాలకంటే బాగా జరిగింది. బిజినెస్ కి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం ‘దసరా’ ప్రీమియర్ గ్రాస్ ని దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ‘దసరా’ చిత్రానికి 5 లక్షల డాలర్లకు పైగా ప్రీమియర్ షోస్ నుండి గ్రాస్ వసూళ్లు రాగా, ‘సరిపోదా శనివారం’ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఒకవేళ ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తే కేవలం ప్రీమియర్ షోస్ నుండే 7 లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు స్టార్ హీరోలకు తప్ప, ఈ స్థాయి వసూళ్లు ఎవరికీ రాలేదు. ఒకవేళ నాని ఆ మార్కుని దాటితే స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టినట్టే అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభం అయ్యాయి.

    కేవలం హైదరాబాద్ లోనే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వహ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయని అంచనా వేస్తున్నారు. కేవలం సూపర్ హిట్ టాక్ రావడం ఒక్కటే బ్యాలెన్స్, అది వస్తే మొదటి రోజు ఓపెనింగ్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండి పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల షేర్ మొదటి రోజున, అలాగే వీకెండ్ కి 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.