Sitara: సినిమా రంగంలో సెలబ్రిటీలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కానీ ఈ చిన్నారి మాత్రం సినిమాలలోకి రాకముందే భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ చిన్నారి తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు అయినప్పటికీ కూడా ఈ చిన్నారి కూడా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ గారాల కూతురు సితార. సితార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె చిన్నతనం నుంచి సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యి భారీగా ఫాలోయింగ్ తెచ్చుకుంది. సామాజిక మాధ్యమాలలో సితార ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అలాగే తన టాలెంట్ వీడియోలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సితార సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ సందడి చేస్తూ ఉంటుంది.
Also Read: ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్..రూ.40 కోట్లు అత్యధిక పారితోషకం అందుకుంటున్న ఏకైక హీరోయిన్..
ఈ క్రమంలో ఆమె చిన్నతనం నుంచి ఇప్పటివరకు సితారకు సంబంధించిన అనేక ఫోటోలు, సితార డాన్స్ వీడియోలు సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యాయి.సితార సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించడమే కాకుండా పలు యాడ్స్లలో కూడా నటిస్తూ తండ్రికి తగిన కూతురిగా పేరు తెచ్చుకుంది. ఈ విధంగా సితార సినిమాలలోకి రాకముందే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ప్రస్తుతం సితార వయసు కేవలం 12 ఏళ్ళు. సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో సితారకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్లకు మించిన క్రేజ్ సితార సొంతం. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో ఈమెకు రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సితార తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సామాజిక మాధ్యమాలలో తన డాన్స్ వీడియోలు షేర్ చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
క్రమంగా సితార సినీ సెలెబ్రిటీలకు కూడా ఇంటర్వ్యూ చేసే స్థాయికి వెళ్ళింది. పలు యాడ్స్ లో నటిస్తూ కూడా సితార బాగా సంపాదిస్తుంది. ఇటీవల సితార ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అగ్రిమెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సితార హీరోయిన్ రేంజ్ లో పారితోషకం అందుకుంటుందని సమాచారం. ఇప్పటివరకు సితార సినిమాలలో కనిపించలేదు కానీ బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రం ఈ చిన్నారి కోట్లలో సంపాదిస్తుంది. తండ్రికి మించిన తనయా అంటూ సామాజిక మాధ్యమాలలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: నాని, అనుష్క శెట్టి కాంబినేషన్ లో మిస్ అయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అదేనా?