Chiranjeevi: చిరంజీవి కి బాగా నచ్చిన నటుడు ఎవరో తెలుసా..?

కప్పుడు తెలుగు ప్రేక్షకులైతే చిరంజీవి సినిమా కోసం ఎదురుచూసేవారు. ఒక్కసారి ఆయన సినిమా వచ్చిందంటే చాలు కలెక్షన్ల సునామీని సృష్టించేది. జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా రిలీజ్ సమయం లో తెలుగు రాష్ట్రం లో తుఫాన్ వచ్చింది.

Written By: Gopi, Updated On : February 13, 2024 10:13 am
Follow us on

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో మెగాస్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకొని, దానికి అనుగుణంగానే ఆయన సినిమాలు చేస్తూ ఇండియాలోనే టాప్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే చిరంజీవి అప్పట్లో చేసిన వరుస సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి.

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులైతే చిరంజీవి సినిమా కోసం ఎదురుచూసేవారు. ఒక్కసారి ఆయన సినిమా వచ్చిందంటే చాలు కలెక్షన్ల సునామీని సృష్టించేది. జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా రిలీజ్ సమయం లో తెలుగు రాష్ట్రం లో తుఫాన్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందంటే చిరంజీవి క్రేజ్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన క్రేజ్ ముందు తుఫానులు, సునామీలు ఏవి పని చేయవని నిరూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే చిరంజీవికి ఇష్టమైన నటుడు ఎవరు అంటే విలక్షణమైన నటనను కనబరిచే ప్రకాష్ రాజ్ అంటే చిరంజీవి కి చాలా ఇష్టమట. ఎందుకంటే ప్రకాష్ రాజ్ మామగా, తమ్ముడిగా, అన్నగా, విలన్ గా అన్ని రకాల పాత్రల్లో పోషించి ఏ పాత్రలో నటించిన కూడా తనకంటే గొప్పగా ఎవరూ నటించలేరు అనే విధంగా తన నట విశ్వరూపాన్ని చూపించి ఆ పాత్రలో ఒదిగిపోయి మరి నటిస్తాడు.

కాబట్టి ప్రకాష్ రాజ్ అంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. అలా నటించే నటులు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. అందులో ప్రకాష్ రాజ్ మొదటి స్థానంలో ఉంటాడని, కూడా చిరంజీవి చెప్పడం విశేషం. అందుకే తనంటే ఇష్టమని అలాంటి నటులను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే ఇండస్ట్రీలో విలక్షణమైన నటులు చాలామంది వస్తారని కూడా చిరంజీవి ఒకానొక సందర్భంలో తెలియజేశారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని ఈ సినిమా యూనిట్ ఇప్పటికే భారీ అంచనాలను పెట్టుకుంది…