Rajamouli
Rajamouli: రాజమౌళి ఎంచుకున్న హీరో పేరిట నయా రికార్డులు నమోదు అవుతాయి. స్టార్డం వేరే లెవెల్ కి వెళుతుంది. ఆయన సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన నటులకు కూడా లైఫ్ టైం సెటిల్మెంట్ అవుతుంది. తమతో, తమ కుమారులతో మూవీ చేయాలని రాజమౌళిని కాకా పట్టేవారు, ప్రసన్నం చేసుకోవాలి అనుకునే పెద్దలు ఉన్నారు. యమదొంగ సమయంలో విష్ణుతో మూవీ చేయమని రాజమౌళిని మోహన్ బాబు చాలా రిక్వెస్ట్ చేశాడట. మోహన్ బాబే కాదు, పలువురు ఈ ప్రయత్నాలు చేశారు. అందుకే ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు టైమింగ్ కూడా ముఖ్యం అంటారు.
Also Read: విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ స్టోరీ ఇదేనా..?
అయితే రాజమౌళి మాత్రం తాను అనుకున్న కథను ఎంచుకున్న హీరోతోనే చేస్తాడు. కాగా రాజమౌళిని రిజెక్ట్ చేసిన స్టార్స్ లిస్ట్ పెద్దదే. కథ నచ్చకో, డేట్స్ కుదరకో, రెమ్యూనరేషన్ కోసమో ఆయన సినిమాల్లో నటించేందుకు కొందరు ఆసక్తి చూపలేదు. వారిలో బాలకృష్ణ ఒకరు. సింహాద్రి మూవీ బాలకృష్ణతో చేయాలని రాజమౌళి అనుకున్నారు. ఈ కథను బాలయ్య రిజెక్ట్ చేశాడు. దాంతో అది జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. ఎన్టీఆర్ కెరీర్లో సింహాద్రి బిగ్గెస్ట్ హిట్ గా ఉంది.
పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలని రాజమౌళి తీవ్రంగా ప్రయత్నించాడు. ఒకటి రెండు సార్లు కలిసి కథ వినిపించాడు. పవన్ నుండి సమాధానం రాకపోవడంతో రవితేజతో చేశాడు. విక్రమార్కుడు పవన్ కళ్యాణ్ తో రాజమౌళి చేయాలని అనుకున్నాడట. ఇక బాహుబలి తెలుగు సినిమా గతిని మార్చిన చిత్రం. ఈ మూవీలో ప్రధాన విలన్ భల్లాల దేవ పాత్రను రానా చేశాడు. ఈ పాత్రకు రాజమౌళి మొదట జాన్ అబ్రహంని అనుకున్నాడు. ఆయన రిజెక్ట్ చేశాడు.
అలాగే శివగామి పాత్రకు శ్రీదేవిని అనుకున్నాడు. ఆమెతో చర్చలు జరిపాడు. శ్రీదేవి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో రమ్యకృష్ణనను తీసుకున్నాడు. రెమ్యూనరేషన్ కోసం బాహుబలిని వదులుకుందని వచ్చిన వార్తలను శ్రీదేవి ఓ సందర్భంలో ఖండించింది. ఇక ఆ చిత్రానికి ఐకానిక్ రోల్ గా నిలిచిన కట్టప్ప పాత్ర కోసం మోహన్ లాల్ ని సంప్రదించాడు రాజమౌళి. ఆయన డేట్స్ కుదరక చేయలేదు. ఆ పాత్ర సత్యరాజ్ ని వరించింది. పలు భాషల్లో సత్యరాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు.
Web Title: Do you know which stars rejected rajamouli
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com