Homeఎంటర్టైన్మెంట్Krishna And NTR: ఎన్టీఆర్ ని రాజకీయంగా వ్యతిరేకించిన కృష్ణ... ఆయన ముందే సభలో ఏం...

Krishna And NTR: ఎన్టీఆర్ ని రాజకీయంగా వ్యతిరేకించిన కృష్ణ… ఆయన ముందే సభలో ఏం మాట్లాడారో తెలుసా?

Krishna And NTR: నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఎన్టీఆర్ ని కృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ మీద సెటైరికల్ మూవీస్ తీశారు. కాగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేదిక పంచుకున్న కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Also Read: విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ స్టోరీ ఇదేనా..?

ఎన్టీఆర్ కి ధీటుగా అభిమానులను సొంతం చేసుకున్న నటుడు కృష్ణ. టాలీవుడ్ కి ఎన్టీఆర్-ఏఎన్నార్ రెండు కళ్ళు అనేవారు. వారి తర్వాత స్టార్ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ సంచలనాలు నమోదు చేశాడు. ఎన్టీఆర్-కృష్ణ పలు చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సూపర్ హిట్ మల్టీస్టారర్స్ లో నటించారు. నటులుగా వారి మధ్య మంచి అనుబంధం ఉండేది. అయితే ఎన్టీఆర్ ని కృష్ణ రాజకీయంగా వ్యతిరేకించాడు. ఎన్నికల్లో గెలిచి 1983లో ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టాడు.

ఎన్టీఆర్ రాజకీయ విధానాలు, పాలనా తీరుపై అసహనం వ్యక్తం చేశాడు కృష్ణ. ఈ క్రమంలో ఎన్టీఆర్ పై పొలిటికల్ సెటైరికల్ మూవీస్ తెరకెక్కించాడు. మండలాధీశుడు, నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి చిత్రాల్లో ఎన్టీఆర్ ని కృష్ణ ఏకిపారేశారు. మండలాధీశుడు చిత్రంలో ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రను కోట శ్రీనివాసరావు చేశాడు. ఎన్టీఆర్ పొలిటికల్ గెటప్ ని కూడా అనుకరించారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఒకసారి కోట పై దాడికి ప్రయత్నం చేశారు.

ఎన్టీఆర్-కృష్ణ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని అప్పట్లో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. వారిద్దరి అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకించుకునేవారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా ఒక సభ జరిగింది. ఈ సభకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. ఏఎన్నార్ తో పాటు చిత్ర ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ ని ఉద్దేశించి కృష్ణ మాట్లాడారు. అప్పటికే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణ ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

కృష్ణ సింపుల్ గా తన స్పీచ్ ముగించాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు నమస్కారాలు చెప్పిన కృష్ణ.. గత 10-15 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి తరలించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అది జరగలేదు. చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని విషయాలు తెలిసిన అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి.. ఆయన ఆద్వైర్యంలో హైదరాబాద్ కి తెలుగు చిత్ర పరిశ్రమ రావాలని కోరుకుంటూ.. సెలవు తీసుకుంటున్నాను.. అని కృష్ణ అన్నారు. దశాబ్దాల కాలం నాటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తరం హీరోల గట్టి కృషి ఫలితంగా టాలీవుడ్ హైదరాబాద్ కి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదగడానికి వారి ప్రయత్నం కారణమైంది.

RELATED ARTICLES

Most Popular