Varalakshmi Sarath Kumar: సౌత్ ఇండియా లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులలో ఒకరు వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar). తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్(Sarath Kumar) కూతురుగా ఈమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. హీరోయిన్ గా పలు సూపర్ హిట్ సినిమాలను అందుకున్న ఈమె, ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ లేడీ విలన్ గా కొనసాగుతుంది. మన తెలుగు లో ఈమె నాంది, తెనాలి రామకృష్ణ BABL,క్రాక్, వీర సింహా రెడ్డి, యశోద, హనుమాన్ వంటి చిత్రాల్లో నటించి మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కేవలం సౌత్ లోనే కాదు, నార్త్ ఇండియా లో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టేందుకు తన తండ్రి సపోర్టు తీసుకోలేదు. కేవలం తన సొంత టాలెంట్ తోనే జీరో నుండి మొదలు పెట్టి ఇండస్ట్రీ లోకి వచ్చింది.
Also Read: విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ స్టోరీ ఇదేనా..?
రీసెంట్ గా ఆమె ఒక డ్యాన్స్ ప్రోగ్రాం లో పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయినటువంటి ఒక మహిళా పాల్గొంది. ఈమె ఎవ్వరూ ఊహించని రీతిలో అద్భుతమైన డ్యాన్స్ ని ప్రదర్శించి తన సత్తా చాటింది. అనంతరం ఆమె జీవితంలో ఎదురుకున్న కష్టాలను తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు సర్దిచెప్పే క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, ఎవరికీ తెలియనివి పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘మీతో నేను ఒక రహస్యాన్ని ఈరోజు పంచుకోవాలని అనుకుంటున్నాను. సినిమాల్లోకి రాకముందు నేను మొట్టమొదటిసారి ఒక ప్రముఖ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. అందుకు నాకు 2500 రూపాయిలు ఇచ్చారు. అలాంటి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఎవ్వరూ కూడా రోడ్డు మీద డ్యాన్స్ వేయడం తప్పుగా భావించవద్దు’ అంటూ ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీ లో ఎదిగిన తర్వాత తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చింది కానీ, ఆమె తన తండ్రి పేరు ని ఎప్పుడూ అవకాశాల కోసం ఉపయోగించుకోలేదు. ఇలాంటి వారసులు ఇండస్ట్రీ లో చాలా అరుదుగా ఉంటారు. తన సొంత టాలెంట్ కారణంగా నేడు ఇండియా లోనే వరలక్ష్మి శరత్ కుమార్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే పెళ్లి చేసుకొని స్థిరపడిన వరలక్ష్మి, పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేతిలో శివంగి, జన నాయగన్(Jana Nayagan) వంటి సినిమాలు ఉన్నాయి. జన నాయగన్ లో హీరోగా విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె విజయ్ ‘సర్కార్’ చిత్రం లో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో కూడా ఆమె ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు టాక్.