BalaKrshina : ప్రస్తుతం బాలకృష్ణ-ఎన్టీఆర్ ఉప్పు నిప్పులా ఉంటున్నారు. కొన్నేళ్లుగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు వీరి మధ్య గ్యాప్ పెంచాయి. అసలు కలిసేందుకు ఇష్టపడటం లేదు. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు. అలాగే బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలను కూడా ఆయన అవైడ్ చేశాడు. ఇక ఎన్టీఆర్ పై ఒకటి రెండు సందర్భాల్లో బాలకృష్ణ తన అసహనం ప్రదర్శించారు. ఈ ఘటనలు ఎన్టీఆర్-బాలయ్య మధ్య ఉన్న మనస్పర్థలు తెలియజేస్తున్నాయి.
అయితే ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో బాలయ్యతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. తన సినిమాల్లో బాలకృష్ణ రిఫరెన్సులు వాడేవాడు. కాగా ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రం బాలకృష్ణకు బాగా నచ్చిందట. ఆ చిత్రం ఆది అట. ఈ మూవీ స్పెషల్ షో వేయించుకుని చూసిన బాలకృష్ణ దర్శకుడు వివి వినాయక్ కి ఛాన్స్ ఇచ్చాడట. ఈ విషయాన్ని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలియజేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. బాలకృష్ణతో మాట్లాడి వివి వినాయక్ తో కథ చెప్పించాను. అనంతరం ఆది మూవీ డైరెక్టర్ అని చెప్పాను. ముందే చెప్పాలి కదయ్యా అన్నాడు. ఆది సూపర్ హిట్ అని బాలకృష్ణకు తెలుసు. కానీ సినిమా చూడలేదు. వివి వినాయక్ కి ఆది ఫస్ట్ మూవీ. కొత్త డైరెక్టర్ కావడంతో తెలియదు. ఆది స్పెషల్ స్క్రీనింగ్ వేయండి చూద్దాం అన్నారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ఆది మూవీ వేసి ఆయనకు చూపించాము. బాలకృష్ణకు బాగా నచ్చింది.
సినిమా ముగిశాక… ఎన్టీఆర్ కి ఫోన్ చేయమన్నాడు. బాగా నటించావ్ రా, ఆది సినిమా చాలా బాగుంది అని ఎన్టీఆర్ ని బాలయ్య పొగిడారు… అని అన్నారు. వివి వినాయక్ రెండో మూవీ చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. వంద రోజులు ఆడింది. మొదట్లో నెమ్మదించిన ఈ చిత్రం మెల్లగా పుంజుకుంది. బాలయ్య డ్యూయల్ రోల్ చేశాడు. ఫ్యాక్షనిస్ట్ రోల్ లో చాలా పవర్ఫుల్ గా బాలయ్యను వివి వినాయక్ ప్రజెంట్ చేశాడు. ఫ్యాన్స్ కి చెన్నకేశవరెడ్డి మూవీ ఫీస్ట్ అని చెప్పాలి.