https://oktelugu.com/

Pushpa 2 The Rule  : పుష్ప 2 క్లైమాక్స్ లో కనిపించిన విలన్ ఎవరో తెలుసా..? ఆయన వల్లే క్లైమాక్స్ అంత బాగా వచ్చిందా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి చాలా కొత్తగా ఉంటుంది. అందుకోసమే చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసి ఇక్కడ స్టార్ స్టేటస్ ను అందుకొని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఇక్కడ సక్సెస్ అయితే రాదు. అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళకంటూ స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : December 8, 2024 / 02:00 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 The Rule  : పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ సాధించడానికి హీరో అల్లు అర్జున్ ఎంత కారణమో, సుకుమార్ కూడా అంతే కారణం. ఇక సుకుమార్ రాసుకున్న చాలా ఎలివేటెడ్ సీన్లు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమే కాకుండా సినిమా థియేటర్ కి వచ్చేలా చేస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ భారీ రేంజ్ లో పాట్ అయితే చేశాడు. ఆ సీన్ లో అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్బంలోనే ఈ సీన్ ఇంత లెవెల్లో పండడానికి బుగ్గారెడ్డి అనే పాత్రను పోషించిన నటుడు కూడా చాలా వరకు కారణమనే చెప్పాలి. ఇక ఎందుకంటే ఇప్పటివరకు ఈ నటుడిని మనం పెద్దగా సినిమాల్లో చూడలేదు. కానీ డిఫరెంట్ నటనతో నటించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంటున్న నటుడు ఎవరు అంటే ‘తారక్ పొన్నప్ప’ అనే ఒక కన్నడ నటుడు కావడం విశేషం… నిజానికి ఆయన నటించిన నటన చాలా అద్భుతంగా ఉంది. ఒక సైకో విలన్ పాత్రలో నటించడమే కాకుండా ఆయన ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తో పోటీపడి మరి నటించి తన విలనిజాన్ని పండించాడు.

    అందువల్లే ఆసీన్ అనేది చాలా బాగా ఎలివేటైంది. నిజానికి తారక్ పొన్నప్పకి ఇదే మొదటి సినిమానా అంటే కాదు. ఇక ఇప్పటికే ఆయన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాల్లో కూడా నటించాడు. అయితే దయ పాత్రలో మనకు కేజిఎఫ్ సిరీస్ లో కనిపిస్తాడు. ఇక దాంతో పాటుగా దేవర సినిమాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు.

    ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాలో ఆయన నటించిన విలనిజం అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇకమీదట కూడా ఆయనకు భారీ అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి తనలాంటి నటుడితో నటింపజేయడం అనేది కూడా ఒక ఆర్ట్ అనే చెప్పాలి.

    ఇక దర్శకుడు అంతటి మంచి నటుడిని తీసుకున్నప్పుడు తన నటన పరిధిని అంచనా వేస్తూ క్యారెక్టర్ లను రాసినప్పుడే ఆయా నటులకు కూడా ఆ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది. అయితే సుకుమార్ బుగ్గారెడ్డి పాత్రను చాలా బాగా రాసుకున్నాడు. కాబట్టి ఆయన క్యారెక్టర్ చాలా బాగా ఎలివేట్ అయిందనే చెప్పాలి…