Allu Arjun : పుష్ప 2 తో అల్లు అర్జున్ స్టామినా ఏమిటో బయటపడింది. తెలుగుతో సమానంగా ఆయనకు నార్త్ లో క్రేజ్ ఏర్పడిందని అర్థం అవుతుంది. మలయాళ, కన్నడ, తమిళ్ లో కూడా పుష్ప 2 చిత్రానికి చెప్పుకోదగ్గ రెస్పాన్స్ రావడం విశేషం. అత్యంత వేగంగా రూ. 500 కోట్ల వసూళ్ల క్లబ్ లో పుష్ప 2 చేరింది. ఫస్ట్ టు డేస్ లో పుష్ప 2 రూ. 449 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. మూడు రోజుల్లోనే ఈ మూవీ ఇండియా వైడ్ రూ. 380 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 3వ రోజు పుష్ప 2 రూ. డొమెస్టిక్ గా అన్ని భాషల్లో కలిపి రూ.120 కోట్లు వసూలు చేసింది ఇదో రికార్డు. ఇక నార్త్ అమెరికాలో పుష్ప 2 కలెక్షన్స్ $ 6 మిలియన్స్ దాటేశాయి.
హిందీలో ఫస్ట్ డే ఈ చిత్రం 72 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు రూ. 56 కోట్ల వరకు రాబట్టింది. శనివారం భారీగా పుంజుకుంది. ఫస్ట్ డే వసూళ్లకు మించి శనివారం పుష్ప 2 హిందీ వసూళ్లు ఉండనున్నాయి. మొదటి శనివారం పుష్ప 2 రూ. 75 నుండి 80 కోట్ల వసూళ్లు రాబట్టవచ్చు అని అంచనా. వీకెండ్ ముగిసే నాటికి దాదాపు రూ. 250 కోట్లకు పైగా పుష్ప 2 హిందీ రాబట్టనుంది.
పుష్ప 2 ఈ స్థాయిలో వసూళ్ళు అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు. రూ. 1000 కోట్ల టార్గెట్ తో అల్లు అర్జున్ బరిలో దిగాడు. అది కేక్ వాక్ అనిపిస్తుంది. 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్. దాదాపు మూడేళ్లు ఈ సినిమా చిత్రీకరించారు. అల్లు అర్జున్, సుకుమార్ బాగా కష్టపడ్డారు. వారి శ్రమకు సక్సెస్ రూపంలో ఫలితం దక్కింది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించింది. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ వంటి నటులు కీలక రోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన పుష్ప 2 యూనిట్.. మహిళా అభిమాని రేవతి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.