https://oktelugu.com/

Heoines in Business : సినిమాల్లో వస్తున్న ఆదాయం సరిపోవట్లేదట.. డబ్బు కోసం ఈ హీరోయిన్లు  ఏం చేశారో తెలుసా..?

అయితే హీరోయిన్లు ఎక్కువ శాతం యాడ్స్ లో నటించడం ద్వారా సంపాదిస్తారని ఇప్పటివరకు అనుకున్నారు. కానీ కొందరు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు.మరి ఆ టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందామా..

Written By:
  • Srinivas
  • , Updated On : May 23, 2023 / 09:20 AM IST
    Follow us on

    Heoines in Business : ఈ రోజుల్లో ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇక సినీ సెలెబ్రెటీల విషయానికి వస్తే వారికి వచ్చే పారితోషికం కోట్లలో ఉంటుంది. అందుకు తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా లక్షల్లో ఉంటుంది. అందుకే కొందరు కేవలం సినిమాలపై వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా ఇతర సైడ్ బిజినెస్ చేస్తూ సంపాదిస్తుంటారు. ఇలాంటి వారిలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా  ఉన్నారు. అయితే హీరోయిన్లు ఎక్కువ శాతం యాడ్స్ లో నటించడం ద్వారా సంపాదిస్తారని ఇప్పటివరకు అనుకున్నారు. కానీ కొందరు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు.మరి ఆ టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందామా..
    సమంత: సౌత్ ఇండస్ట్రీలో సమంతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. స్టార్ హీరోయిన్ అయినందున సమంతకు రెమ్యూనరేషన్ కోట్లలోనే ఉంటుంది.అయినా  సమంత సొంతంగా సాకీ వరల్డ్ పేరుతో దుస్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.
    ఇలియానా: గోవా బ్యూటీ ఇలియానా ఆ మధ్య టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు.కానీ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది.. అయితే ఈ గోవా బ్యూటీ సొంత రాష్ట్రంలో రెస్టారెంట్లు, బేకరీలను  పెట్టి సైడ్ బిజినెస్ చేస్తుందట. ఈ వ్యాపారం ద్వారా ఆమె నెలకు లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతుందట.
    కీర్తి సురేష్: మహానటి సినిమా ద్వారా జాతీయ అవార్డు పొందిన కీర్తి సురేష్ కు తమిళంలో కంటే తెలుగులోనే గుర్తింపు వస్తుంది. ఇటీవల ఆమె నటించిన దసరా సినిమా పాన్ ఇండియా లెవల్లో హిట్టు కొట్టింది. దీంతో తెలుగులో ఏ అవకాశం వచ్చిన వదులుకోవడం లేదు. కీర్తి సురేష్ కూడా కేవలం సినిమా సంపాదనపైన ఆధారపడలేదు. భూమి మిత్ర పేరుతో స్కిన్ కేర్ ను నిర్వహిస్తోంది.
    కాజల్ అగర్వాల్: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో నటించింది. పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేస్తున్న ఈమె లేటెస్ట్ గా బాలయ్య బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కాజల్ అగర్వాల్ సొంతంగా ఫ్యాషన్ జువెలర్స్ షాప్ ను నిర్వహిస్తున్నారు.
    తమన్నా: మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి పాన్  ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తమన్నా ఎక్కువగా జువెల్లరీ యాడ్స్ లో రావడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఆమె సొంతంగా కూడా ఫ్యాషన్ జ్యువెలరీ  షాప్ ను నిర్వహిస్తున్నారు.
    రకుల్ ప్రీత్ సింగ్ : హిట్టు ఫట్టు తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని పెంచుకుంటూ పోతుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆమధ్య రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన జిమ్ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆమె ఏదో సెంటర్లో కసరస్తు చేస్తున్న వీడియో కాదు. తన సొంతంగా నిర్వహిస్తున్న జిమ్ సెంటర్ లోనిదే . అంటే రకుల్ ప్రీత్ సింగ్ సొంతంగా జిమ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు.