https://oktelugu.com/

Mrunal Thakur : హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ కొన్న సీతారామం బ్యూటీ? మృణాల్ ఏమందంటే!

ఆ ఇంటి అడ్రస్ చెప్పండి. నేను కూడా వెళ్లి చూస్తాను, అని సెటైర్ వేశారు. నేను ఇల్లు కొన్న విషయం నాకు కూడా తెలియదు. మీకు తెలిసిందా అని పరోక్షంగా వార్తలను ఖండించారు. 

Written By: , Updated On : May 23, 2023 / 09:04 AM IST
Follow us on

Mrunal Thakur : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది మృణాల్ ఠాకూర్. ఈ బాలీవుడ్ బ్యూటీ సీతారామంతో తెలుగులో అడుగుపెట్టింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ సీతారామం భారీ విజయం సాధించింది. దుల్కర్ సల్మాన్-మృణాల్ జంటగా నటించారు. రష్మిక మందాన కీలక రోల్ చేసింది. ఈ మూవీలో సీతగా మృణాల్ అద్భుతం చేసింది. ఆమె నటన, అందం ప్రేక్షకులను కట్టిపడేశాయి. దెబ్బకు మృణాల్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

సీతారామం అనంతరం ఆమె నానితో జతకడుతున్నారు. నాని 30వ చిత్రంలో మృణాల్ హీరోయిన్. కొత్త దర్శకుడు శౌర్యు ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. జెర్సీలో ఫ్యామిలీ మెన్ గా, గుడ్ ఫాదర్ గా నాని సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో నాని ఓ పాపకు తండ్రిగా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. బహుశా మృణాల్ నాని భార్య పాత్ర చేసే అవకాశం కలదు. 
 
ఈ చిత్ర షూటింగ్ కోసం మృణాల్ తరచుగా హైదరాబాద్ వస్తుంది. అలాగే కొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. దీంతో ఆమె హైదరాబాద్ లో ఓ లగ్జరీ హౌస్ కొన్నారట. దీని విలువ కోట్లలో ఉందట. ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై మృణాల్ స్పందించారు. అవునా… ఆ ఇంటి అడ్రస్ చెప్పండి. నేను కూడా వెళ్లి చూస్తాను, అని సెటైర్ వేశారు. నేను ఇల్లు కొన్న విషయం నాకు కూడా తెలియదు. మీకు తెలిసిందా అని పరోక్షంగా వార్తలను ఖండించారు. 
 
అంటే హైదరాబాద్ లో మృణాల్ లగ్జరీ హౌస్ కొన్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. మృణాల్ కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. లవ్ సోనియా మూవీ ఆమెకు ఫేమ్ తెచ్చింది. సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో ఆమె మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. నాని చిత్రంతో పాటు హిందీలో మరో మూడు చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆమె కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిశారు.