Dimple Hayati : రవితేజ హీరోయిన్ డింపుల్ హయాతీపై కేసు నమోదు… ఆ నేరానికి గానూ!

ఇందులో కూడా ఆమె మెయిన్ హీరోయిన్ రోల్ చేశారు. ఫలితం మాత్రం బెడిసికొట్టింది. ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో ఒకటి విజయం సాధించినా డింపుల్ కెరీర్ కి ప్లస్ అయ్యేది. 

Written By: Shiva, Updated On : May 23, 2023 11:54 am
Follow us on

Dimple Hayati : హీరోయిన్ డింపుల్ హయాతీ, ఆమె స్నేహితుడు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వారు ఓ ఐపీఎస్ అధికారి వాహనం పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో పోలీసులు చర్యలకు దిగారు. విషయంలోకి వెళితే… డింపుల్ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్ తో పాటు జూబ్లీ హిల్స్, జర్నలిస్ట్ కాలనీ సమీపంలో గల ఎన్ కే ఆర్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో ఐపీఎస్ అధికారితో వీరికి పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఐపీఎస్ అధికారి కారు పార్క్ చేసే స్థలంలో తమ కారు పార్క్ చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారట. 

 
తాజాగా ఐపీఎస్ అధికారి కారును డింపుల్ ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టిందట. అలాగే కాలితో తన్ని డ్రైవర్ ని తిట్టిందట. దీంతో డింపుల్ ఆమె ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టారు. హైదరాబాద్ కి చెందిన డింపుల్ హయాతీ మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. 2017లో విడుదలైన గల్ఫ్ మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఒకటి రెండు హిందీ, తమిళ చిత్రాలు చేసింది. 
 
గద్దలకొండ గణేష్ మూవీలో డింపుల్ హయాతీ ఐటెం సాంగ్ చేసింది. ఖిలాడీ మూవీలో రవితేజకు జంటగా భారీ ఆఫర్ దక్కించుకుంది. రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న రోల్ లో డింపుల్ హయాతీ ఆకట్టుకుంది. అయితే ఖిలాడీ నిరాశపరిచింది. తాజాగా గోపీచంద్ కి జంటగా రామబాణం చేసింది. ఇందులో కూడా ఆమె మెయిన్ హీరోయిన్ రోల్ చేశారు. ఫలితం మాత్రం బెడిసికొట్టింది. ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో ఒకటి విజయం సాధించినా డింపుల్ కెరీర్ కి ప్లస్ అయ్యేది.