https://oktelugu.com/

Rambha: రీ ఎంట్రీ కి సిద్దమైన సీనియర్ హీరోయిన్ రంభ..ఆ స్టార్ హీరో సినిమాలో ఛాలెంజింగ్ రోల్!

నటనతో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ సంపాదించింది. అతి తక్కువ సమయంలోనే వరుస బ్లాక్ బస్టర్స్ ని అందుకొని స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది.

Written By: , Updated On : March 1, 2025 / 06:06 PM IST
Rambha

Rambha

Follow us on

Rambha: కొంతమంది స్టార్ హీరోయిన్లు సినిమాలకు దూరమైనప్పుడు అభిమానులు చాలా బాధపడుతుంటారు. ఎంతమంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి వచ్చినా, వాళ్ళు మాత్రం ఆ హీరోయిన్స్ ని మర్చిపోలేరు. మిస్ అవుతూనే ఉంటారు. అలాంటి బలమైన ప్రభావం చూపించిన హీరోయిన్స్ లో ఒకరు రంభ(Heroine Rambha). ఈమె అసలు పేరు విజయ లక్ష్మి. విజయవాడ కి చెందిన అచ్చ తెలుగు అమ్మాయి. ఈమె హీరోయిన్ గా ఈవీవీ సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందంతో, నటనతో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ సంపాదించింది. అతి తక్కువ సమయంలోనే వరుస బ్లాక్ బస్టర్స్ ని అందుకొని స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది.

Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు

ఆరోజుల్లో ఈమె సౌత్ లో ఏ రేంజ్ స్టార్ హీరోయిన్ అంటే, ఈమె డేట్స్ కోసం సూపర్ స్టార్స్ సైతం ఎదురు చూసే పరిస్థితి. చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో పాటు, తమిళ ఇండస్ట్రీ లో రజినీకాంత్(Superstar Rajinikanth), కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి తన క్రేజ్ ఎలాంటిదో అందరికీ అర్థం అయ్యేలా చేసింది. కేవలం సౌత్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా ఈమె షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలా ఇండియా లోని అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది. అదే విధంగా నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్(Deputy cm Pawan Kalyan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్ వంటి వారితో కలిసి స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ వేసింది.

‘యమదొంగ’ సినిమా తర్వాత పెళ్లి చేసుకొని సినీ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నా ఆమె, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఒక తమిళ స్టార్ హీరో సినిమాలో ఛాలెంజింగ్ రోల్ చేయడానికి ఒప్పుకుందట. అదే విధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధం అంటుంది ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్. రంభ కి కేవలం 48 సంవత్సరాలు మాత్రమే. కాజల్ అగర్వాల్, నయనతార , త్రిష వంటి హీరోయిన్ల ఏజ్ గ్రూప్ అన్నమాట. ఇప్పటికీ చాలా ఫిట్ గానే ఉంది. ఆమె కాస్త స్లిమ్ అయితే హీరోయిన్ గా ఇప్పటికీ రాణించొచ్చు. అంతటి అందం ఆమె సొంతం. కానీ ఆమె హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా, సపోర్టింగ్ రోల్స్, నెగటివ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుందట. మరి రంభ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ ని మరపిస్తుందా లేదా అనేది చూడాలి.

 

Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!