Chiranjeevi Last Film: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్న నటుడు చిరంజీవి (Chiranjeevi)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఆయనకు గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…మరి ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినప్పటికి సిజి వర్క్ కోసం ఈ సినిమా చాలా రోజులు పాటు పోస్ట్ ప్రొడక్షన్ లోనే గడుపుతున్నారు. చిరంజీవికి అనుకున్న విధంగా ఈ సినిమా గ్రాఫిక్స్ అయితే సెట్ అయినట్టుగా తెలుస్తోంది. దాంతో చిరంజీవి ఈ సినిమా ఔట్ పుట్ మీద సంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక భారీ ఎక్స్పరిమెంటల్ సినిమాగా వస్తున్నా ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీ అవుతుందట. ఇక ఈ సినిమాతో పాటుగా చిరంజీవి – అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి మాస్ హీరోగా మరోసారి మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా చిరంజీవి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ను ఫాలో అవుతూ ఈ సినిమా చేస్తున్నారట. తన ఇమేజ్ కి ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకుండానే వల్గర్ కామెడీ లేకుండా, క్రింజ్ కామెడీని అవాయిడ్ చేస్తూ ఒక న్యాచురల్ వే లో సినిమాను చేయాలని చూస్తున్నాడట. ఇక దానికోసమే చిరంజీవి స్క్రిప్ట్ దశ నుంచే ఇవన్నీ చూసుకుంటు వస్తున్నాడట.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
మరి మొత్తానికైతే అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vastunnaam) సినిమాతో వచ్చి మంచి విజయాన్ని సాధించాడు. మరి వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్న అనిల్ రావిపూడి ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న చిరంజీవి ఇకమీదట కూడా భారీ విజయాన్ని అందుకొని ఆయనకంటూ ఒక గొప్ప ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహా అయితే చిరంజీవి మరో 5 సినిమాలు మాత్రమే చేశాడంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఎందుకంటే ఆయనకి ఏజ్ పెరుగుతుండటంతో ఆయన కూడా ఇక రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫ్రీడమ్ ఫైటర్ అయిన సుభాష్ చంద్రబోస్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇక ఎప్పుడు చేసిన ఈ సినిమాతోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట. మరి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…