Pawan Kalyan Movie: చాలా సంవత్సరాల నుండి ఆలస్యం అవుతూ వచ్చిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎట్టకేలకు అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనగా జులై 24 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాని ప్రకటించిన కొత్తల్లో అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి కానీ, ఆలస్యం అవుతూ రావడం వల్ల ఆ అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. కానీ రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఆలస్యం అయినా పర్వాలేదు,అద్భుతమైన క్వాలిటీ సినిమాని రెడీ చేశారు,సరిగ్గా ప్రొమోషన్స్ చేసి విడుదల చేస్తే ఆకాశమే హద్దు అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్ లో ప్రొమోషన్స్ అయితే ఇంకా ప్రారంభించలేదు కానీ, ఈ నెల 15 నుండి నాన్ స్టాప్ ప్రొమోషన్స్ ని ఊహించవచ్చు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నాలుగు రోజుల క్రితమే మొదలైంది. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ పాన్ ఇండియన్ చిత్రాలతో పోలిస్తే ప్రస్తుతానికి చాలా తక్కువ. భవిష్యత్తు లో అత్యధిక షోస్ ని షెడ్యూల్ చేస్తారు కాబట్టి మంచి గ్రాస్ వసూళ్లే రావొచ్చు కానీ, పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గట్టు ఆల్ టైం రికార్డు ని మాత్రం ఈ సినిమాకు మర్చిపోవడమే ఓవర్సీస్ లో. ఎందుకంటే రీసెంట్ పాన్ ఇండియన్ చిత్రాలు అన్ని ఫార్మటు స్క్రీన్స్ లో విడుదల అయ్యేవి. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలను ఐమాక్స్, డీబాక్స్, డాల్బీ సినిమా, 4DX ఫార్మట్స్ లో కన్వర్ట్ చేసి విడుదల చేస్తుంటారు. ఈ స్క్రీన్స్ లో సినిమాలను చూసేందుకు జనాలు ఎగబడుతూ ఉంటారు. కానీ ‘హరి హర వీరమల్లు’ ఈ ఫార్మట్స్ లో విడుదల కావడం లేదని ఆ చిత్ర నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ అధికారిక ప్రకటన చేశాడు.
అందుకు కారణం సూపర్ మ్యాన్ తో పాటు ఫెంటాస్టిక్ 4 మరియు ఇతర భారీ హాలీవుడ్ సినిమాలు విడుదల ఉండడం, థియేటర్స్ మొత్తం ఆ సినిమాలకే కేటాయించడం వల్ల కుదరట్లేదని చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు . ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత భారీగా తీశారో అర్థం అవుతుంది. అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని జూన్ 12 న విడుదల చేసి ఉండుంటే వేరే లెవెల్ లో ఉండేది కదా, అన్ని ఫార్మాట్ స్క్రీన్స్ దొరికేవి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు నిర్మాతలను ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కాకపోతే మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఓజీ చిత్రంతో ఆల్ టైం రికార్డ్స్ ని పెట్టొచ్చు, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు సీనియర్ ఫ్యాన్స్.
