Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియాలో తెలుగు సినిమాలకు ఎక్కువ క్రేజ్ రావడంతో మన దర్శకులంతా పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలుగా వెలుగుందుతున్న వాళ్లతో మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో మన స్టార్ డైరెక్టర్లందరు ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి అందులో భాగంగానే రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు పాన్ ఇండియాలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించారు. ఇక వీళ్ళతో పాటుగా మరి కొంతమంది అదే బాటలో నడుస్తున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న వాళ్ళలో మన డైరెక్టర్లు మొదటి స్థానంలో ఉంటారు. అలాంటి మన దర్శకులు చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది…ఇక బాలయ్య బాబు లాంటి సీనియర్ హీరో సైతం వరుసగా నాలుగు విజయాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు అతనికి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టాయి. మరి ఇక మీదట కూడా ఆయన చేయబోయే సినిమాలు మంచి విజయాలను అందుకోవాలనే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇక దానికోసమే ఆయన పెద్దగా ఎక్స్పరిమెంటల్ సినిమాలైతే చేయడం లేదు. వరుసగా మాస్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే బోయపాటితో అఖండ 2 (Akhanda 2) సినిమాని చేస్తున్న ఆయన తన తదుపరి సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
ఇక ఆ సినిమా తర్వాత ఒక యంగ్ డైరెక్టర్ తో ఒక ఎక్స్పరిమెంటల్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే రాహుల్ సాంకృత్యాయన్ (Rahul Sankrutiyan) డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
అయితే గతంలో రాహుల్ చెప్పిన కథ బాలయ్యకి బాగా నచ్చింది. అందుకే అతనితో సినిమా చేస్తానని గాల్లోనే బాలయ్య కమిట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం రాహుల్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫినిష్ అయిన తర్వాత బాలయ్య బాబుతో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఆ లోపు బాలయ్య కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసి రాహుల్ సినిమా కోసం స్పెషల్ గా రెడీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…