Shankar : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటి పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న ఒకే ఒక్క దర్శకుడు శంకర్… తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన తన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి విజయాలను సాధించాడు. వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి దర్శకుడు గత కొన్ని సంవత్సరాల నుంచి తన పూర్తి ఫామ్ ని అందుకోలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన సినిమాల్లో ఉండే క్వాలిటీ అయితే ఇప్పుడు కనిపించడం లేదు. ఇక ఈ సంవత్సరం వచ్చిన భారతీయుడు 2 సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేకపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో వస్తున్నాడు. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి తన ఖాతాలో మరోసారి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే రామ్ చరణ్ కూడా ఈ సినిమా కోసం భారీగా కష్టపడ్డట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమాలో సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనే చెప్పాలి. సినిమా బడ్జెట్లో సగానికంటే ఎక్కువ సాంగ్స్ మీద కేటాయిస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఎందుకు ఆయన సాంగ్స్ మీద అంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు అంటూ ప్రతి ఒక్కరికి కొన్ని అనుమానాలైతే ఉంటాయి.
ఇక ఇదే విషయాన్ని శంకర్ ని అడిగితే ప్రేక్షకుడు సినిమా థియేటర్ కి వచ్చినప్పుడు ఒక ఇమేజినేషన్ ఉంటుంది. దానిని నేను తెరపై చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకే జీన్స్ సినిమాలోని సాంగ్స్ లో ఏడు వింతలను చూపించాను. ఇక మిగతా సినిమాల్లోని సాంగ్స్ లో కూడా ఎంతో కొంత వైవిధ్యాన్ని చూపిస్తూ భారీగా తీశాను.
దానివల్ల సగటు ప్రేక్షకులు కూడా ఆ సాంగ్స్ ని చూసి తను కొంతవరకు ఆనందాన్ని పొందుతారనే ఉద్దేశ్యంతోనే నేను అలాంటి సాంగ్స్ డిజైన్ చేస్తూ ఉంటానని అని ఆయన చెప్పాడు. నిజానికి శంకర్ సినిమాకి తగ్గట్టుగానే సాంగ్స్ అయితే ఉంటాయి. చూసే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా సాంగ్స్ చూడడానికి కూడా కొంతమంది రిపీటెడ్ గా థియేటర్ కి వచ్చి సినిమాలను చూస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…