Homeట్రెండింగ్ న్యూస్Viral Video : కరెంటు తీగలపై బట్టలు ఆరేస్తున్న వ్యక్తి.. మరీ ఇంత వాయిలంట్ గా...

Viral Video : కరెంటు తీగలపై బట్టలు ఆరేస్తున్న వ్యక్తి.. మరీ ఇంత వాయిలంట్ గా కూడా ఆలోచిస్తారా..

Viral Video :  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాలైన ఆసక్తికరమైన వీడియోలు ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉన్నాయి. అందులో కొన్ని వీడియోలు మిమ్మల్ని నవ్విస్తే మరికొన్ని వీడియోలు ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రపంచం నలుమూలల జరిగే ఏ సంఘటన అయినా వాటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమం లో ఇప్పటి వరకు చాల ఆసక్తి కలిగించే వీడియొ లు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు కూడా ఇటువంటి ఆసక్తిని కలిగించే వీడియొ లను చూడడానికి చాలా ఇష్టపడుతుంటారు. అలాగే ఈ వీడియొ లకు తమ దైన శైలి లో కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతుందని చెప్పొచ్చు. జనాలు కరెంటు లేకపోతే ఆ కరెంటు వైర్లను ఎలా ఉపయోగించుకుంటున్నారో ఈ వీడియోని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోక మానరు. ఈ వీడియోని చూసిన నెటిజన్ లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కరెంటు వైర్ పై బట్టలు ఆరబెడుతున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న కరెంటు వైర్లపై చాలా బట్టలు ఆరబెట్టి ఉన్నాయి. ఒక వ్యక్తి మరికొన్ని బట్టలు తీసుకువచ్చి ఆ కరెంటు వైర్ పై ఆరబెడుతున్నాడు. దాంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు ఆ వైర్లు ఉన్నది బట్టలు ఆరబెట్టడానికే కదా అని చెప్పాడు.

అలా కరెంటు వైర్ పై బట్టలు ఆరబెట్టడం అత్యంత ప్రమాదకరం కదా అని ఆ వ్యక్తి చెప్పగా అతను కరెంటు ఎప్పుడు ఉండదని చెప్పుకొచ్చాడు. కరెంటు వస్తే ఎలా.. కరెంటు వచ్చి ఆ వైర్లు ఒకదానికొకటి తగిలితే ఏమవుతుంది అని ఆ వ్యక్తి ప్రశ్నించినప్పుడు బట్టలు ఆరవేస్తున్న వ్యక్తి కరెంటు లేదని చెప్పాడు. కేవలం బట్టలు ఆరబెట్టడానికి ఈ కరెంటు తీగలు ఉన్నాయని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి తీగలపై ఉన్న తన బట్టలన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాడు. ఒక వ్యక్తి కరెంటు తీగపై బట్టలు అరవేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో పై చాలా మంది నుంచి విశేష స్పందన వస్తుంది. వీడియోను చూసిన నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకే కరెంట్ కావాలి అని అంటారని ఒక సోషల్ మీడియా యూజర్ కామెంట్ చేశాడు. అలాగే ప్రజలు కరెంట్ రాని వైర్లపై బట్టలు ఆరబెట్టుకుంటున్నారు అని మరొక యూజర్ రాసుకొచ్చాడు. కరెంటు అస్సలు రాదు అనేంత నమ్మకం వాళ్లకు ఉందని మరొక యూజర్ రాసుకొచ్చాడు. బహుశా అక్కడి ప్రభుత్వం ఈ కరెంటు తీగ ద్వారా కరెంటును ఎప్పటికీ సరఫరా చేయకపోవచ్చు అంటూ ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version