Allu Arjun and Prabhas : కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏ స్టార్ హీరో సినిమాలు చేసిన కూడా అవన్నీ ఫ్లాప్ అవుతూ ఇండస్ట్రీ నష్టాల్లో నడుస్తు ఉంటుంది. ఇలాంటి సంఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి. కానీ 2024 వ సంవత్సరం మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక స్టార్ హీరోలు చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
2024వ సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. ఇంతకు ముందు వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒకెత్తు ఇప్పటినుంచి మరొక ఎత్తు అనే రేంజ్ లో మన హీరోలు వాళ్ళ స్టామినాని చూపిస్తూ మంచి విజయాలను సాధించారు. ఇక ఇదిలా ఉంటే 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు…
తర్వాత వచ్చిన కల్కి, దేవర లాంటి సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను నమోదు చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా దమ్మెంటో మరోసారి రుచి చూపించాయి. ఇక ప్రభాస్ హీరోగా చేసిన కల్కి మాత్రం 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక దేవర సినిమా కూడా 600 కోట్ల వరకు కలెక్షన్లు కాబట్టి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సంవత్సరం ఎండింగ్ కి వచ్చేసరికి అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక తొందర్లోనే దంగల్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డు సృష్టించిన సినిమాగా పుష్ప 2 సినిమా నిలిచిపోబోతుందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పుడు ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డు బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఆయన దానికి ఆయన చాలా దగ్గరలో ఉన్నాడు. ఆ రికార్డు కూడా బ్రేక్ చేసి తన ఖాతాలో మరొక అరుదైన రికార్డు ను వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక మొత్తానికైతే 2024 వ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా పాన్ ఇండియాలో మన సినిమాల హవా ఎక్కువగా కొనసాగడానికి అవకాశం లభించింది…