Megastar Chiranjeevi Remuneration: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ప్లాప్ తర్వాత తన రెమ్యూనేషన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళా శంకర్. ఈ సినిమాలకు చిరు రేమ్యునిరేషన్ తీసుకోవడం లేదు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రేమ్యునిరేషన్ ఎంతో చెప్పని చిరుని అడిగారు.

కానీ, మెగాస్టార్ మాత్రం ‘ముందు సినిమా చేద్దాం.. సినిమా రిలీజ్ తర్వాత లెక్కలు చూసి, దాని బట్టి ముందుకు వెళ్దాం’ అని చిరు తేల్చి చెప్పారు. ఆచార్య విషయంలో చిరు బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఇక నుంచి సినిమా మొత్తం పూర్తయిన తర్వాత దాని స్థాయి, వచ్చిన లాభాలను బట్టి రెమ్యునరేషన్ తీసుకోవాలని చిరు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Nadendla Counter: సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలే.. జనసేన నేత నాదెండ్ల కౌంటర్
గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల విషయంలో కూడా చిరు ఇలాగే ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి చిరులో చాలా మార్పులు వచ్చాయి. కమర్షియల్ గా సినిమాలు చేయడం చిరుకి మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ, ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మరో ఐదు కథలు రెడీగా మెగాస్టార్ కోసం ఉన్నాయి.

అందుకే.. ఇండస్ట్రీ బాగు కోసం చిరంజీవి తన రెమ్యునరేషన్ ను తీసుకోవడం లేదు. ఇక ఎవరు ఏమనుకున్నా ఈ ఏడాది చిరు మాత్రం 8 సినిమాలను పక్కాగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మొత్తమ్మీద చిరంజీవి డబ్బులు తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ అడిగితే.. 50 కోట్లు అయినా ఇస్తారు. అయినా చిరు నిర్మాతలకు మేలు చేయడం కోసం.. సినిమా రిజల్ట్ ప్రకారం రేమ్యునిరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read:KGF 3 Update: ‘కేజీఎఫ్ 3’ ప్రకటించిన నిర్మాత.. ఎప్పుడు రాబోతుందో తెలుసా ?