https://oktelugu.com/

Gadapa Gadapaku YCP: గడపగడపలోనూ నిలదీతలే.. చుక్కలు చూస్తున్న వైసీపీ నేతలు

Gadapa Gadapaku YCP: ‘సార్ మన ఏరియాకు వస్తారు. సంక్షేమ పథకాలు, అభివ్రుద్ధి బాగానే ఉందని చెప్పండి. ఎటువంటి సమస్యలు ప్రస్తావించకండి’.. గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించే ప్రాంతాల్లో ప్రజలకు వలంటీర్లు ముందుగా చెబుతున్న మాటలివి. ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వలంటీర్లు హెచ్చరికలు సైతం జారీచేస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం భయపడడం లేదు. తాము అడగాల్సినది అడిగేస్తున్నారు. ప్రజాప్రతినిధులను కడిగి పారేస్తున్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు […]

Written By:
  • Dharma
  • , Updated On : May 15, 2022 / 08:34 AM IST
    Follow us on

    Gadapa Gadapaku YCP: ‘సార్ మన ఏరియాకు వస్తారు. సంక్షేమ పథకాలు, అభివ్రుద్ధి బాగానే ఉందని చెప్పండి. ఎటువంటి సమస్యలు ప్రస్తావించకండి’.. గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించే ప్రాంతాల్లో ప్రజలకు వలంటీర్లు ముందుగా చెబుతున్న మాటలివి. ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వలంటీర్లు హెచ్చరికలు సైతం జారీచేస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం భయపడడం లేదు. తాము అడగాల్సినది అడిగేస్తున్నారు. ప్రజాప్రతినిధులను కడిగి పారేస్తున్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆగ్రహించినా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి జగన్‌.. మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. కానీ, ఇందుకు భిన్నంగా చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ‘గడప గడప’లో గద్దించారు.

    Narayana Swamy

    సమస్యలపై నిలదీసినవారిపై ఎదురుదాడికి దిగారు. శనివారం నారాయణస్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని కార్వేటినగరం మండలం, సురేంద్రనగరం పంచాయతీ పరిధిలో పర్యటించారు. రోడ్డుపై పారుతున్న డ్రైనేజీని చూపిస్తూ..ఆయనను ప్రజలు గట్టిగా నిలదీశారు. ‘మా గ్రామంలో సీసీ రోడ్లున్నాయి. కానీ డ్రైనేజీ వ్యవస్థ లేదు. వర్షం పడితే రోడ్ల మీదే నీళ్లు నిలబడుతున్నాయి. ఇబ్బందిగా ఉంది. మా సమస్యను తీర్చండి’ అంటూ గట్టిగా అడిగారు. నిజానికి, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నారాయణస్వామి పర్యటించే ప్రాంతాల్లో ముందుగానే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు.

    Also Read: Swaroopananda Swamy: సుబ్బారెడ్డి కంటే కరుణాకర్ రెడ్డి సో బెటర్.. స్వరూపనంద స్వామిజీ పొగడ్తల వర్షం

    ‘సర్‌ ఎదుట పథకాల గురించి మంచిగా మాట్లాడాలి. ఫిర్యాదులు చేయొద్దు’ అని అభ్యర్థించారు. అయినా, సురేంద్రనగరం పంచాయతీలోని దాసరిగుంట గ్రామంలో ప్రజలు తమ సమస్యలపై నారాయణస్వామిని గట్టిగా ప్రశ్నించారు. డ్రైనేజీపై ప్రశ్నించిన వ్యక్తిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటి ముందు మట్టి అడ్డంగా పెట్టుకున్నారు. లేకుంటే రోడ్డు మీద నీళ్లు నిలబడేవి కావు’ అని గదమాయించారు. ఈ సమస్య గురించి ఫేస్‌బుక్‌లో ఎందుకు పోస్ట్‌ చేశావంటూ మరో వ్యక్తిని గట్టిగా మందలించారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నం చేసిన విలేకరులను నారాయణస్వామి అనుచరులు అడ్డుకున్నారు.

    వింత అనుభవాలు

    MLA Sudhir Reddy

    కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. శనివారం ఆయన పెద్దముడియం మండలం భీమగుండం, భూతమాపురం గ్రామాల్లో ‘గడప గడపకు.. ’ నిర్వహించారు. ఇల్లు కట్టుకోలేదన్న నెపంతో ఇచ్చిన పట్టాను వెనక్కి లాక్కున్నారని ఓ వికలాంగ జంట ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వారికి పట్టా ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అయితే తాము ఇల్లు కట్టుకోలేమని, ప్రభుత్వమే కట్టించాలని ఆ దంపతులు మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే మాత్రం.. ‘మీరే ఇల్లు కట్టుకోవా’లంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటి బిల్లు రావడం లేదని ఓ వృద్ధుడు వాపోగా.. గత ప్రభుత్వం చేసిన మోసాలవల్లే అలా జరుగుతోందని ఎమ్మెల్యే బదులిచ్చారు. తమ ఇంటి పట్టా లాక్కున్నారని కొందరు ఫిర్యాదు చేస్తే.. వస్తున్నారు, పోతున్నారుగానీ.. మాకేమీ ఒరగలేదంటూ కొందరు మహిళలు ఎమ్మెల్యే ముఖం మీదే అనేశారు.

    Also Read:Nadendla Counter: సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలే.. జనసేన నేత నాదెండ్ల కౌంటర్

    Tags