https://oktelugu.com/

Swaroopananda Swamy: సుబ్బారెడ్డి కంటే కరుణాకర్ రెడ్డి సో బెటర్.. స్వరూపనంద స్వామిజీ పొగడ్తల వర్షం

Swaroopananda Swamy: తెలుగునాట ఇప్పుడు స్వామిజీల హవా నడుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వామిజీలకు ఎనలేని గౌరవం ఇస్తున్నారు. అందునా విశాఖ శారదా పీఠానికి చెందిన స్వరూపనందస్వామి అంటే వారికి ఎనలేని అభిమానం. తమ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలని, సుస్థిరత సాధించాలని స్వామిజీ ప్రత్యేక యాగాలు, పూజలు చేయడమే ఇందుకు కారణం. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ఉభయ రాష్ట్రాల సీఎంలు విశాఖ వెళ్లి స్వరూపనందను దర్శించుకుంటారు. నేరుగా సీఎంలే వచ్చి స్వామిజీని స్మరించకోవడంతో స్వరూపానందకు తెలుగునాట […]

Written By:
  • Dharma
  • , Updated On : May 15, 2022 / 08:08 AM IST
    Follow us on

    Swaroopananda Swamy: తెలుగునాట ఇప్పుడు స్వామిజీల హవా నడుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వామిజీలకు ఎనలేని గౌరవం ఇస్తున్నారు. అందునా విశాఖ శారదా పీఠానికి చెందిన స్వరూపనందస్వామి అంటే వారికి ఎనలేని అభిమానం. తమ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలని, సుస్థిరత సాధించాలని స్వామిజీ ప్రత్యేక యాగాలు, పూజలు చేయడమే ఇందుకు కారణం. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ఉభయ రాష్ట్రాల సీఎంలు విశాఖ వెళ్లి స్వరూపనందను దర్శించుకుంటారు. నేరుగా సీఎంలే వచ్చి స్వామిజీని స్మరించకోవడంతో స్వరూపానందకు తెలుగునాట క్రేజ్ అమాంతం పెరిగింది. అందుకే ప్రజాప్రతినిధులు, ప్రధానంగా వైసీపీ నేతలు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా స్వామిజీని ఆహ్వానించక మానరు. నేతల ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమాలకు హాజరవుతున్న స్వామిజీ అతిథి సత్కారాలు బాగుంటే తెగ పొగుడుతారట.

    Swaroopananda Swamy

    తనకు ఎవరు ఎక్కువ సేవలు చేస్తే వారే గొప్ప అని ప్రకటించడం అలవాటుగా చేసుకున్నారట. అంతవరకూ బాగానే ఉంది కానీ వారు గొప్ప అని చెప్పాలంటే ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడతారట. ప్రస్తుత టీటీడీ చైర్మన్ కంటే.. గతంలో ఓ సారి టీటీడీ చైర్మన్‌గా చేసిన కరుణాకర్ రెడ్డినే చాలా గొప్ప అని తేల్చేశారట. తిరుపతిలో గంగమ్మ జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి స్వరూపానందను… ఆయన పీఠం వారసుడు అయిన మేనల్లుడు స్వాత్మేత్రానందను కూడా ప్రత్యేకంగా పిలిచారు. సేవతో పాటు మర్యాదలను భారీగా చేయడంతో స్వామిజీలు పొంగిపోయారు. కరుణాకర్ రెడ్డిని పొగడకపోతే బాగుండదని భావించి సుబ్బారెడ్డి కంటే సో బెటర్ అని కితాబిచ్చేశారు.

    Also Read: Amit Shah: అమిత్ షా టీపీసీసీ అధ్యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనా?

    మీడియాకు లీకులు..
    అయితే వారి పొగడ్తలు అంతటితో ఆగలేదు. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తి టీటీడీ పాలక మండలికి ఇక రారు పుట్టబోరు అని వీరలెవల్లో తేల్చిచెప్పారట. ఇప్పుడు ఉన్న పాలక మండలి పెద్దగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలు లేవని సైతం తేల్చేశారు. ఇందుకు కరోనా కారణమో లేక బుద్ది మాంద్యమో మాకు తెలియడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆర్జిత సేవల రద్దుపై వివరణ కోరిన మీడియాకు తప్పకుండా సేవలపై స్పందిస్తామని… మాకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటేనని చెప్పారు. దీనిపై ఆదివారం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడతామని.. తమ మనోగతాన్ని వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.

    Swaroopananda Swamy

    మరింతగా విమర్శలకు దిగనున్నట్టు మీడియాకు లీకులిచ్చారు. సాధారణంగా స్వామిజీలు తమ మాట చెల్లుబాటు కాకపోయినా, తాము చెప్పిన పని చేయకపోయినా, తాము అనుకున్నది కాకపోయినప్పుడు అసంత్రుప్తి వ్యక్తం చేస్తారు. అయితే స్వరూపానంద స్వామికి సుబ్బారెడ్డితో ఎక్కడ చెడిందో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. స్వరూపానంద రిషికేష్‌లో ఉన్నా ఆయన దగ్గరకు సుబ్బారెడ్డి పరులుగు పెట్టుకుంటూ వెళ్తారు. అయినా స్వరూపానంద ఏం అడిగారో.. సుబ్బారెడ్డి ఏం కాదన్నారో కానీ ఆయనపై కోపం వచ్చింది. ఆదివారం ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో. మొత్తానికి బ్లాక్ మెయిల్ లాంటి కామెంట్లు చేసి పనులు సాధించుకోవడం స్వామికి బాగా అలవాటైపోయిందని.. వైసీపీలోనే గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

    Also Read:Nadendla Counter: సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలే.. జనసేన నేత నాదెండ్ల కౌంటర్

    Tags