https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ మూవీ ఏమిటో తెలుసా..?

Prabhas: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్లు మరియు బ్లాక్ బస్టర్ హిట్లు ఎన్ని ఉన్నాయో..ఫ్లాప్ మూవీస్ , అట్టర్ ఫ్లాప్ మూవీస్ కూడా అన్నే ఉన్నాయి..ఇప్పుడంటే వరుసగా డబల్ హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి కానీ..ఒక్కప్పుడు చాలా కాలం ఎన్టీఆర్ ఫ్లాప్స్ లోనే ఉన్న సందర్భాలు ఉన్నాయి..సింహాద్రి తర్వాత యమదొంగ దాదాపుగా ఆయన నాలుగేళ్ల పాటు ఫ్లాప్స్ లోనే ఉన్నాడు..యమదొంగ తర్వాత వచ్చిన కంత్రి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆ సినిమా తర్వాత వచ్చిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 22, 2022 / 01:08 PM IST
    Follow us on

    Prabhas: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్లు మరియు బ్లాక్ బస్టర్ హిట్లు ఎన్ని ఉన్నాయో..ఫ్లాప్ మూవీస్ , అట్టర్ ఫ్లాప్ మూవీస్ కూడా అన్నే ఉన్నాయి..ఇప్పుడంటే వరుసగా డబల్ హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి కానీ..ఒక్కప్పుడు చాలా కాలం ఎన్టీఆర్ ఫ్లాప్స్ లోనే ఉన్న సందర్భాలు ఉన్నాయి..సింహాద్రి తర్వాత యమదొంగ దాదాపుగా ఆయన నాలుగేళ్ల పాటు ఫ్లాప్స్ లోనే ఉన్నాడు..యమదొంగ తర్వాత వచ్చిన కంత్రి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆ సినిమా తర్వాత వచ్చిన అదుర్స్ మరియు బృందావనం సినిమాలు మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇక బృందావనం తర్వాత వచ్చిన శక్తి , ఊసరవెల్లి మరియు దమ్ము వంటి సినిమాలు ఆయన కెరీర్ లో భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి..ఈ మూడు సినిమాల తర్వాత ఆయన చేసిన బాద్ షా మూవీ మళ్ళీ సూపర్ హిట్ గా నిలబడగా, ఆ సినిమా తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్యా మరియు రభస వంటి సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.

    Prabhas, NTR

    వీటిల్లో ముఖ్యంగా మనం రామయ్య వస్తావయ్యా అనే సినిమా గురించి మాట్లాడుకోవాలి..పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసి..బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో ఫుట్ బాల్ ఆడుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అప్పట్లో అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎన్టీఆర్ గత చిత్రాలకంటే అద్భుతమైన బిజినెస్ జరిగిన చిత్రం గా నిలిచింది..తీరా సినిమా విడుదల అయ్యేసరికి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది..ఫస్ట్ హాఫ్ అభిమానులను బాగానే అలరించినప్పటికీ..సెకండ్ హాఫ్ మొత్తం అప్పట్లో ప్రభాస్ హీరో గా నటించిన రెబెల్ సినిమాతో డిట్టో పోలి ఉండడం తో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది..ప్రభాస్ నటించిన రెబెల్ సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది..అలాంటి సినిమా స్టోరీ ని కాపీ కొట్టడం ఏమిటి అని ఎన్టీఆర్ అభిమానులు అప్పట్లో హరీష్ శంకర్ పై విరుచుకుపడ్డారు.

    Also Read: YCP Alliance With Congress: కాంగ్రెస్ వైపు జగన్ చూపు.. వచ్చే ఎన్నికల్లో పొత్తు

    రామయ్య వస్తావయ్యా మరియు రభస సినిమాల తర్వాత స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో జరుగుతున్నా తప్పులు తెలుసుకున్న ఎన్టీఆర్, ఇక అప్పటి నుండి స్క్రిప్ట్ సెలెక్షన్స్ విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ టెంపర్ నుండి #RRR వరుకు వరుసగా 6 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన హీరో గా సరికొత్త రికార్డు లోకి ఎక్కాడు..కెరీర్ తొలినాళ్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండవ సినిమా గోకులం లో సీత నుండి ఖుషి వరుకు వరుసగా 6 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు..ఆయన తర్వాత మళ్ళీ వరుసగా 6 బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఏకైక నేటి తరం స్టార్ హీరో గా ఎన్టీఆర్ సరికొత్త చరిత్ర సృష్టించారు..ప్రస్తుతం #RRR సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్..అతి త్వరలోనే తన తదుపరి చిత్రం ని ప్రారంభించబోతున్నారు..ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో ఆయన ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ మూవీ జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతున్నట్టు సమాచారం.

    Also Read: TDP Mahanadu 2022: మహానాడుకు అన్నగారి కుటుంబసభ్యులు… జూనియర్ ఎన్టీఆర్ పైనే చంద్రబాబు ఫోకస్

    Recommended Videos:

    Tags