https://oktelugu.com/

S S Rajamouli: రాజమౌళి చెప్పిన ఆ మార్పులు చెయ్యడం వల్లే రాధే శ్యామ్ అంత పెద్ద ఫ్లాప్ అయ్యిందా??

S S Rajamouli:వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి రాధే శ్యామ్ రూపం లో మధ్యలో ఒక్క అడ్డుకట్ట పడిన సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడం తో బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం ని చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే అతి పెద్ద ఫ్లాప్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 22, 2022 / 01:14 PM IST
    Follow us on

    S S Rajamouli:వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి రాధే శ్యామ్ రూపం లో మధ్యలో ఒక్క అడ్డుకట్ట పడిన సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడం తో బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం ని చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది..సుమారు మూడేళ్ళ పాటు ప్రభాస్ ని వెండితెర మీద చూడడం కోసం ఎదురు చూసిన అభిమానులకు తీవ్రమైన నిరాశ ఎదురు అయ్యింది ఈ సినిమా వల్ల..ప్రభాస్ వంటి మాస్ యాక్షన్ హీరో నుండి ఇంత సాఫ్ట్ లవ్ స్టోరీ ని జనాలు రిసీవ్ చేసుకోలేకపోవడం వల్లనే ఈ ఫలితం వచ్చింది అని ట్రేడ్ వర్గాల అంచనా..అంతే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం SS రాజమౌళి అని ఇండస్ట్రీ లో గత కొంత కాలం నుండి ఒక్క టాక్ వినిపిస్తుంది.

    Radhe Shyam

    Also Read: Hero Yash: య‌ష్ తో మూవీ చేసేందుకు క్యూ క‌డుతున్న ఇండియ‌న్ డైరెక్టర్లు.. ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్‌..?

    ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం చిత్రం యొక్క నిడివి తగ్గించడం వల్లనే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..సినిమా ఫైనల్ ఔట్పుట్ లో చివరి ఎడిటింగ్ సమయం లో ప్రభాస్ రాజమౌళి కి సినిమా చూపించాడు..సినిమా లో లగ్ కొంచెం ఎక్కువగా అనిపించడం తో రాజమౌళి కొన్ని సీన్స్ కట్ చెయ్యమని చెప్పాడట..ఆ సన్నివేశాలు అన్నీ కట్ చేసిన తర్వాత 2 గంటల 45 నిముషాలు ఉండాల్సిన సినిమా కేవలం 2 గంటల 20 నిముషాల నిడివి ఉన్న సినిమాగా మారింది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..ఇందువల్ల సినిమాలో కొన్ని సన్నివేశాలకు కనెక్ట్ కావాల్సిన ఎమోషన్స్ రాజమౌళి కట్ చెయ్యమని చెప్పిన ఆ సన్నివేశాల వల్ల మిస్ అయ్యింది అని డైరెక్టర్ రాధా కృష్ణ హర్ట్ అయ్యాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి..ఆ సన్నివేశాలు లేకపోవడం వల్లే సెకండ్ హాఫ్ హడావుడి గా ముగిసిన ఫీలింగ్ చూసే ఆడియన్స్ కి కలిగింది అట..తొలగించిన ఆ సన్నివేశాలు ఏమిటో ఇప్పుడైనా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే చూస్తాము కదా అంటూ డైరెక్టర్ రాధా కృష్ణ ని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియా లో టాగ్ చేసి అడుగుతున్నారు.

    Radha Krishna Kumar

    ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..KGF సిరీస్ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం తో ఈ క్రేజీ కాంబినేషన్ పై అభిమానుల్లో అంచనాలు తార స్థాయి కి చేరుకున్నాయి..ఇప్పటికే 30 శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ప్రభాస్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్నా యాక్షన్ సినిమా కావడం తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఈసారి కచ్చితంగా బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని ప్రభాస్ అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..ఈ సినిమా తో పాటుగా ప్రభాస్ ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ K అనే సినిమాలు కూడా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలతో పాటు మరో 9 యాక్షన్ సినిమాలను లైనప్ లో సిద్ధం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

    Also Read: PM Modi Jammu Kashmir Visit: కశ్మీర్ ప్రగతికి కేంద్రం పెద్దపీట.. 24న ప్రధాని పర్యటన సందర్బంగా ఉత్కంఠ

    Recommended Videos:

    Tags