https://oktelugu.com/

Ravi Teja Son First Film: రవితేజ కొడుకు మొదటి సినిమా డైరెక్టర్ ఫిక్స్

Ravi Teja Son First Film: టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోలు గా ఎదిగి ఎంతోమంది యంగ్ స్టర్స్ కి ఆదర్శంగా నిలిచినా హీరోలు చాలా మంది ఉన్నారు..అలాంటి హీరోలలో ఒక్కరు మాస్ మహారాజా రవితేజ..ఈయన కూడా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా మెగాస్టార్ గా సుమారు మూడు దశాబ్దాల నుండి నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని […]

Written By: , Updated On : April 22, 2022 / 01:00 PM IST
Follow us on

Ravi Teja Son First Film: టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోలు గా ఎదిగి ఎంతోమంది యంగ్ స్టర్స్ కి ఆదర్శంగా నిలిచినా హీరోలు చాలా మంది ఉన్నారు..అలాంటి హీరోలలో ఒక్కరు మాస్ మహారాజా రవితేజ..ఈయన కూడా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా మెగాస్టార్ గా సుమారు మూడు దశాబ్దాల నుండి నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ వచ్చిన వాడే..కెరీర్ ప్రారంభం లో చిన్న పాత్రల ద్వారా ఒక్కో మెట్టు ఎక్కుతూ మెల్లగా హీరో అవకాశాలను రప్పించుకున్నాడు రవితేజ..వచ్చిన ప్రతి అవకాశం ని నూటికి నూరు పాళ్ళు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో హిట్లు , బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి నేడు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒక్కరిగా కొనసాగుతున్నాడు ఆయన..ఇది ఇలా ఉండగా రవితేజ కి మహాధన్ అనే ఒక్క కొడుకు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈయన రవితేజ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం రాజా ది గ్రేట్ అనే సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారక్టర్ ని చేసాడు.

Ravi Teja Son First Film

Ravi Teja Son First Film

`వెండితెర మీద కనిపించింది కాసేపే అయ్యినప్పటికీ రవితేజ కొడుకు అద్భుతంగా నటించాడు అని..కుర్రాడిలో విషయం ఉంది అని చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు..ఇక అప్పటి నుండి రవితేజ కొడుకు హీరో గా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని సోషల్ మీడియా లో జరుగ ప్రచారాలు సాగుతున్నసంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం మహాధన్ వయస్సు 16 ఏళ్ళు..వాడి చదువు పూర్తి అవ్వగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని రవితేజ పలు సందర్భాలలో కొన్ని ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ మధ్య గ్యాప్ లో టాలీవుడ్ కి చెందిన ఒక్క టాప్ డైరెక్టర్, కాలేజీ నేపథ్యం లో సాగే ఒక్క యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని రవితేజ కొడుకు మహాధన్ తో తియ్యడానికి రవితేజ ని కోరారు అట..రవితేజ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..ఆ డైరెక్టర్ మరెవరో కాదు రవితేజ తో రాజా ది గ్రేట్ అనే సూపర్ హిట్ సినిమా తీసిన అనిల్ రావిపూడి గారే.

Ravi Teja Son Mahadhan Debut Movie || Ravi Teja Son First Movie Director || Oktelugu Entertainment

Ravi Teja Son First Film

Anil Ravipudi

Also Read: YCP Alliance With Congress: కాంగ్రెస్ వైపు జగన్ చూపు.. వచ్చే ఎన్నికల్లో పొత్తు

ఈ సినిమా షూటింగ్ సమయం లో మహాధన్ కి సీన్ ని వివరించిన వెంటనే చురుగ్గా స్పందిస్తూ తక్కువ టేక్స్ లోనే సన్నివేశాలను పూర్తి చేసిన తీరు అనిల్ రావిపూడి కి ఎంతగానో నచ్చింది అని..అందుకే ఆయనతో ఒక్క సినిమా చేయలని నిర్ణయించుకున్నాడు అట..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది..ఇక రవితేజ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన టైగర్ నాగేశ్వర రావు మరియు రావణాసుర అనే సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..క్రాక్ సినిమా తో ఇండస్ట్రీ లో రీసౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ కి, ఆ తర్వాత వచ్చిన ఖిలాడీ సినిమా ద్వారా పెద్ద ఫ్లాప్ ఎదురైనా సంగతి మన అందరికి తెలిసిందే..అందుకే ఇక నుండి ఆయన స్సీరువుట్ సెలెక్షన్స్ విషయం లో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు ఒప్పుకుంటున్నాడు..అలా ఒప్పుకున్నా సినిమాలే ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన చేస్తున్న రెండు సినిమాలు..వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఒక్క సినిమాలో కూడా రవితేజ ఒక్క ముఖ్య పాత్రని పోషించబోతున్నట్టు తెలుస్తుంది..ఇందులో ఆయన చిరంజీవి కి తమ్ముడిలా కనిపించబోతున్నాడు..అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

Also Read: Balakrishna: ఆ షోలో హీరో బాలకృష్ణను ఘోరంగా అవమానించారా.. గాడిద అంటూ?

Recommended Videos:

Actress Kajal Aggarwal Son Name || Gautam Kitchlu Announced Baby Boy Name || Oktelugu Entertainment

Balayya Heroine Sonal Chauhan seen at Mumbai Airport Arrivals || Oktelugu Entertainment

Ram Charan Shares A Funny Fight Between His Mother and Grand Mother || Oktelugu Entertainment

Tags