https://oktelugu.com/

Nagarjuna : ఆ హీరోయిన్ కి నాగార్జున చేసిన అన్యాయం ఏమిటో తెలుసా?

Nagarjuna తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఈవీవీ అడగడంతో నో చెప్పలేక ఒకే చేసిందట. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ నెట్టింట వైరల్ అవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 14, 2024 8:00 pm
    Do you know the injustice done by Nagarjuna to that heroine

    Do you know the injustice done by Nagarjuna to that heroine

    Follow us on

    Nagarjuna : టాలీవుడ్ టాప్ స్టార్ గా వెలుగొందారు నాగార్జున. క్లాస్, మాస్, డివోషనల్ జోనర్స్ లో అద్భుత విజయాలు సాధించి కంప్లీట్ హీరో అనిపించుకున్నారు. అప్పట్లో దాదాపు అందరు స్టార్ హీరోయిన్స్ తో నటించారు. నాగార్జున వంటి స్టార్ ఛాన్స్ పక్కన ఛాన్స్ అంటే.. ఏ హీరోయిన్ అయినా ఓకే చెప్పాల్సిందే. అలాంటిది ఒక స్టార్ బ్యూటీ నాగార్జునతో సినిమా చేయనని భీష్మించుకుని కూర్చుందట. ఆయన ఎన్ని సార్లు అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిందట. అందుకే వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు.

    ఆమె ఎవరో కాదు తెలుగు అమ్మాయి రంభ. హీరోయిన్ రంభ 90లలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అపట్లో ఇండస్ట్రీని ఊపేసింది. స్టార్ హీరోలతో జత కట్టింది. బోల్డ్ హీరోయిన్ గా రంభ పేరు తెచ్చుకుంది. గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జేడీ చక్రవర్తి, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. కానీ నాగార్జునతో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. నాగార్జున మీద కోపంతోనే కలిసి నటించలేదట.

    ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో నాగార్జున, రమ్య కృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ముందుగా రమ్య కృష్ణ బదులు రంభను తీసుకోవాలి అని అనుకున్నారట ఈవీవీ. కానీ నాగార్జున రమ్య కృష్ణ ని హీరోయిన్ గా పెట్టాలని కోరారట. దాంతో ఈవీవీ అయిష్టంతోనే రంభకు బదులు రమ్య కృష్ణని తీసుకున్నారట. ఈ సినిమా హిట్ అవడంతో సౌందర్య, రమ్య కృష్ణ కి మంచి పేరు వచ్చింది.

    అయితే నాగార్జున వల్ల ఆ సినిమా మిస్ అయ్యాయని .. ఇక అస్సలు నాగార్జునతో సినిమాలు చేయకూడదని రంభ డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా .. నాగార్జునతో సినిమాలు రిజెక్ట్ చేసిందట. కానీ ఇదే సినిమాలో రంభ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించడం విశేషం. తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఈవీవీ అడగడంతో నో చెప్పలేక ఒకే చేసిందట. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ నెట్టింట వైరల్ అవుతుంది.