Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఇక తన నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున సైతం చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సైతం స్టార్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నా కూడా అతనికి భారీ సక్సెస్ దక్కడం లేదు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటివరకు సరైన సక్సెస్ రాలేదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అఖిల్ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు.
నాగార్జున ఇన్ని రోజుల వరకు తన కొడుకుల విషయంలో అసలు జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటామని అందులో నాగార్జునను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారట. కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత అఖిల్ విషయంలో మాత్రం నాగార్జున కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.
దాదాపు ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో మంతనాలు జరుపుతున్నాడు. లెనిన్ సినిమాతో వచ్చిన సక్సెస్ ని వాడుకుంటూ వరుసగా రెండు మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లు దక్కేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. నాగార్జున ఏది చేసినా కూడా అది ఒక ప్రణాళికబద్ధంగా చేస్తూ వెళ్తాడు.
కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇదంతా చూసిన సినిమా మేధావులు సైతం నాగార్జున ఎట్టకేలకు తన కొడుకుల బాధ్యతను తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…

